HMDA Land Auction: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి భూముల వేలానికి హెచ్‌ఎండీఏ (HMDA) రంగం సిద్ధం చేసింది. నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతాలైన కోకాపేటలోని నియో పోలీస్, కూకట్‌పల్లి పరిధిలో ఉన్న మూసాపేట వై జంక్షన్ వద్ద భూముల అమ్మకానికి HMDA ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం 47 ఎకరాల భూమిని వేలం వేయనున్నారు.
Chevella Tragedy: చేవెళ్ల దారుణం.. స్పందించిన సీఎం రేవంత్, కేసీఆర్..!
కోకాపేట నియో పోలీస్‌లో 32 ఎకరాలు, కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద 15 ఎకరాల భూమి అమ్మకానికి సిద్ధమైంది. ఈ వేలంలో భూముల ప్రారంభ ధరను HMDA నిర్ణయించింది. కోకాపేట నియో పోలీస్‌లో ఎకరా ప్రారంభ ధర రూ. 99 కోట్లుగా, కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఎకరా ప్రారంభ ధర రూ. 75 కోట్లుగా నిర్ణయించారు. ఈ భూముల వేలం ద్వారా దాదాపు 4,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని హెచ్‌ఎండీఏ అంచనా వేస్తోంది.
Road Accident: చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టి బోల్తా పడిన టిప్పర్..!
ఈ వేలం పాట ఆన్‌లైన్‌లో జరగనుంది. ఇందుకు సంబంధించి నవంబర్ 24, 28, డిసెంబర్ 3, 5 తేదీల్లో ఈ భూముల వేలంపాట తేదీలను కూడా HMDA ప్రకటించింది. ఈ కీలక ప్రాంతాల్లో జరుగుతున్న భూముల వేలం రియల్ ఎస్టేట్ రంగంలో మరోసారి ఉత్సాహాన్ని నింపుతుందని భావిస్తున్నారు.