BRS KTR: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి నుంచి జీహెచ్ఎంసీలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
తెలంగాణ భవన్లో కార్మికులను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మన బ్రతుకు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మర్చిపోయి కూడా లంగలకు, దొంగలకు ఓట్లు వేయొద్దని ఆయన కోరారు. హృదయం లేని మనిషి ప్రధాని మోడీ అని ఆయన విమర్శించారు. కార్పొరేట్లకు 14 లక్షలు కోట్లు మాఫీ చేశాడు. ఇది తప్పని బండి సంజయ్, కిషన్ రెడ్డి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని, మోడీ కార్పొరేట్ దోస్త్ లకు…
కరీంనగర్ జిల్లా ఆలుగునూర్లో మానకొండూర్ నియోజకవర్గ బూత్ సభ్యుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోతే జూన్ 2 తరువాత హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ప్రమాదముందని తెలిపారు. మాకు మూడో వంతు మెజారిటీ ఇవ్వండి రిజర్వేషన్లు ఎత్తేస్తం అని బీజేపీ వాళ్ళు అంటున్నారని పేర్కొన్నారు. ఎంపీగా పని చేసిన బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడగాలని…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనల్ని ప్రజలు ఓడించలేదు.. మనల్ని మనమే ఓడించుకున్నామని కేటీఆర్ తెలిపారు. మనం కూడా జై శ్రీరామ్ అందాం.. రాముడు అందరివాడు.. రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కూడా కాదన్నారు. కరీంనగర్ జిల్లాకు ఏం చేశారో చర్చకు సిద్ధమా అని బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్ లో…
BRS KTR: నేడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. వేములవాడ, మానకొండూర్, కరీంనగర్, చొప్పదండి నియోజక వర్గాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు.
BRS KTR: బీఆర్ఎస్ లోనే తనకు గౌరవం ఉండేదని పార్టీ మారిన తర్వాత ఈటల రాజేందర్ చెప్పిన మాటను గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
BRS Foundation Day: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏప్రిల్ 27న ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నేడు 23వ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పథకాలను నిలిపివేస్తారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు బుధవారం అన్నారు. ఎందుకంటే, తాను ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయకున్నా రేవంత్‌రెడ్డికి ప్రజలు ఓట్లు వేస్తారని భావించి ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. ఎస్ నిజామాబాద్‌లో బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఓటు వేయాలని కేటీఆర్ ప్రజలను కోరారు. బీఆర్ఎస్ మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా జరిగిన రోడ్‌షోలో…