మల్కాజ్గిరి పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు 10-12 సీట్లు గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉంటదని మాట్లాడుతున్నారు.. ఈ దేశంలో ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని 13 పార్టీలు ఉన్నాయి.. అవన్నీ పెద్ద పార్టీలేనని తెలిపారు. ఈ 13 పార్టీలే రేపు ఢిల్లీని శాసించవచ్చు.. మనం శాసించి లొంగదీసుకుందామా? యాచిద్దామా? అని…
సార్వత్రిక ఎన్నికల వేళ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ గవర్నర్ గా ఉన్నప్పుడు తనకు తెలంగాణ ప్రజల మధ్య బీఆర్ఎస్ నేతలు గ్యాప్ క్రియేట్ చేశారని ఆరోపించారు.
KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం వెంకంపేట చౌరస్తాలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందన్నారు.
ఎన్ని కష్టాలు వచ్చినా కేసీఆర్‌తోనే ఉన్నా పద్మారావు గౌడ్‌కు 60 వేల మెజార్టీ ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. పద్మారావు గౌడ్ కేసీఆర్‌కు తమ్ముడి లాంటి వారని ఆయన అన్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా అడ్డగుట్ట, సీతాఫల్ మండి డివిజన్లలో జరిగిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
MP Dr. Laxman: గాడిద గుడ్డు కాదు.. మీకు పాము గుడ్డు గుర్తు కావాలని రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం అబద్దాలతో అడ్డ దారులు తొక్కుతుందన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. తమ నియోజకవర్గంలో గడపగడపకు వెళ్తూ.. తమ పార్టీ చేసిన మంచి పనులను వివరిస్తూ, ఓటేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగానే.. బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూకట్‌పల్లిలో ఆయన తరుఫున కేటీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు.
తిరుమలలో భారీ వర్షం.. చల్లబడిన వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా 45 డిగ్రీలు, 46 డిగ్రీలు నమోదవుతోంది. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. మండే ఎండలతో వడగాలులకు వడదెబ్బ తాకి జన ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండల్లో జోరు వాన పడింది. భారీ వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. తిరుపతి దేవస్థానం…
BRS KTR: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి నుంచి జీహెచ్ఎంసీలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
తెలంగాణ భవన్లో కార్మికులను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మన బ్రతుకు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మర్చిపోయి కూడా లంగలకు, దొంగలకు ఓట్లు వేయొద్దని ఆయన కోరారు. హృదయం లేని మనిషి ప్రధాని మోడీ అని ఆయన విమర్శించారు. కార్పొరేట్లకు 14 లక్షలు కోట్లు మాఫీ చేశాడు. ఇది తప్పని బండి సంజయ్, కిషన్ రెడ్డి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని, మోడీ కార్పొరేట్ దోస్త్ లకు…
కరీంనగర్ జిల్లా ఆలుగునూర్లో మానకొండూర్ నియోజకవర్గ బూత్ సభ్యుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోతే జూన్ 2 తరువాత హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ప్రమాదముందని తెలిపారు. మాకు మూడో వంతు మెజారిటీ ఇవ్వండి రిజర్వేషన్లు ఎత్తేస్తం అని బీజేపీ వాళ్ళు అంటున్నారని పేర్కొన్నారు. ఎంపీగా పని చేసిన బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడగాలని…