కాళేశ్వరం విషయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్ లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏడాదికి కరెంట్ బిల్లే రూ.10 వేల కోట్లు అవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు కూడా చేయలేదని విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. కొంతకాలం క్రితం వరకు ధీమాగా ఉన్న రైతాంగం ప్రస్తుతం దిగాలు పడుతోందని కేసీఆర్ అన్నారు.
మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారని..అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నిన్న నాలుగు గంటలు టీవీ స్టుడియోలో ఎలా కూర్చున్నాడని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మందేసి గీశాడో.. దిగాక గేసాడోగానీ కూలిపోయిందని విమర్శించారు.
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా .. ‘తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3 వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిన పాలమూరు బిడ్డ అనన్య రెడ్డి కి ప్రత్యేక అభినందనలు. వరుసగా రెండోసారి తెలంగాణ బిడ్డకు జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ రావటం చాలా సంతోషానిస్తోంది. వందలోపు…
అధికార పార్టీ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ఎత్తుగడలు చేస్తోంది అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారు.. ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు.. కేసీఆర్, కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.
హన్మకొండ జిల్లాలోని మడికొండ సత్యం గార్డెన్స్ లో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య విరుచుకపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని తెలిపారు.
సుమారు 1200 మంది వాలంటీర్ల రాజీనామా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో సుమారు 1200 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వారు నిర్వహిస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా వాలంటీర్లను విధుల నుండి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వాలంటీర్లంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెయ్యాలంటే వారు స్వయంగా రంగం లోకి దిగాల్సిందేనని తీర్మానించుకుని ఈ రాజీనామా అస్త్రాలు సంధిస్తున్నారు. రాజీనామాలు అనంతరం వీరంతా పార్టీ…
BRS KTR: బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్..
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడు రోజుల కస్టడీ నేటితో ముగిసింది. సీబీఐ అధికారులు ఆమెను ఇవాళ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.