G. Kishan Reddy: దేశానికి ప్రధాని ఎవరు కావాలి.? మోడీనా.? రాహుల్ గాంధీనా.? అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అద్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈనెల పదవ తేదీన మోడీ హైదరాబాద్ కు వస్తున్నారని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు మోడీ సభ ఉంటుందన్నారు. దేశం కోసం బీజేపీ రావాలి.. మోడీ రావాలి.. నరేంద్ర మోడీ దేశం కోసం ప్రధాని కావాలని అన్నారు. రాహుల్ గాంధీ ఆయన కోసం ప్రధాని కావాలని అనుకుంటున్నాడని తెలిపారు. మోడీ మోడీ అనే నినాదాలు ఇస్తే ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్, సెక్రటేరియట్ లో ఉన్న రేవంత్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాలన్నారు. పదవ తేదీన యువత అంత బైకులపైన స్టేడియంకు కదిలి రావాలన్నారు. తొలి ఓటర్లు అంత ఉదయాన్నే వెళ్లి ఓటెయ్యాలన్నారు. కుటుంబ సభ్యులు.. ఫ్రెండ్స్ తో కలిసి పోలింగ్ బూత్ కు వెళ్లాలని తెలిపారు. పోలింగ్ బూత్ కు వెళ్లే ముందు ఓటయ్యడానికి వెళ్తున్నామని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాలన్నారు. ఓటేశాక.. మేము ఓటేశామని ఫోటో తీసి పెట్టి.. మీరంతా ఓటెయ్యండి అని క్యాప్షన్ పెట్టాలని పిలుపు నిచ్చారు.
Read also: CPI Narayana: అందాలు, ప్యాషన్ పోటీ పెడితే.. మోడీ కి ప్రథమ బహుమతి వస్తుంది..
ఫ్యామిలీ.. ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి ఓటెయ్యాలి అని చెప్పాలన్నారు. యువతంతా ఓటెయ్యాలని మోడీ పిలునిచ్చారన్నారు. దేశానికి ప్రధాని ఎవరు కావాలి.? మోడీనా.? రాహుల్ గాంధీనా.? అని ప్రశ్నించారు. దేశంలో అభివృద్ధి కావాలా.? ఉగ్రవాదం కావాలా.? అని ప్రశ్నించారు. తొమిదిన్నర ఏళ్లలో జరిగిన ఏ విషయంలో అయిన చర్చకు సిద్ధమన్నారు. ఏ అంశం పైన అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్ తో మేము చర్చకు సిద్ధమన్నారు. పాకిస్థాన్ వాళ్లు మన దేశంలో ఏం చేయాలి అనుకుంటే అది చేసేవాళ్లన్నారు. డెబ్బై ఏళ్లుగా పాకిస్థాన్ అరాచకాలు భరిస్తూ వచ్చామన్నారు. మన రక్తంతో పాకిస్థాన్ లో పండగలు చేసుకునే వాళ్లన్నారు. సర్జికల్ స్ట్రైక్ తో పాకిస్థాన్ ఇంట్లోకి వెళ్లి ఉగ్రవాదులను పట్టుకున్నాం.. అంతమొందించామన్నారు. ప్రపంచంలో పాకిస్థాన్ ను ఏకాకిని చేసి.. బిచ్చం అడుక్కునే లాగా చేశాడు మోడీ అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి మన దేశ విద్యార్థులను తీసుకువచ్చాడు మోడీ తెలిపారు. ప్రపంచంలో యుద్ధాన్ని ఆపిన ఏకైక వ్యక్తి మోడీ అని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.. దేశ భవిష్యత్తు కోసం మోడీకి ఓటెయ్యండన్నారు.
DK Aruna: లక్కీ డిప్ లో రేవంత్ రెడ్డికి సీఎం పదవి తగిలింది..