సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టీ. పద్మారావు గౌడ్ కి మద్దతుగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్ నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు ముఠా జై సింహ, రామేశ్వర్ గౌడ్ , బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: CPI Narayana: అందాలు, ప్యాషన్ పోటీ పెడితే.. మోడీ కి ప్రథమ బహుమతి వస్తుంది..
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెసోళ్లు ఎన్ని హామీలిచ్చిన ప్రజలు నమ్మడం లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు.. రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేసినా అని హోర్డింగ్లు పెట్టుకున్నారు.. పాపం రాహుల్ గాంధీకి ఏమీ తెలియదు.. ఆయన వచ్చి ఏదో మాట్లాడిపోయిండని విమర్శించారు. ఇక, కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయి ఐదేళ్లు అయ్యింది. పైసా తెచ్చిండా? కరోనా టైమ్ లో పేదవాళ్లకు పద్మారావు గౌడ్ భోజనం పెడితే.. కిషన్ రెడ్డి కుర్ కురే ప్యాకెట్లు పంచిండు అంటూ ఎద్దేవా చేశారు. ముషీరాబాద్ కు, సికింద్రాబాద్ రాలే.. ఒక్క సింటెక్స్ ట్యాంక్ మాత్రం ఓపెన్ చేసిండు.. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని అనుకునేటోళ్లకు ఒక ఉపాయం చెబుతా.. మాకు 10-12 సీట్లు ఇస్తే చాలు.. మళ్లీ రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారు అని కేటీఆర్ అన్నారు.
Read Also: S Jaishankar: చాలా ముస్లిం దేశాలు భారత్‌తో స్నేహాన్ని కోరుకుంటున్నాయి..
రాష్ట్రానికి ఒక్క రూపాయి తీసుకు రానీ కిషన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయలి అని కేటీఆర్ ప్రశ్నించారు. సికింద్రాబాద్ లో పద్మారావు కన్నా గొప్ప క్యాండిడేట్ ఎవ్వరు లేరు.. గతంలో ఐదు సీట్లు ఇస్తేనే కేసీఆర్ తెలంగాణను తెచ్చారు.. జూన్ 2 తర్వాత హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది.. కేంద్రంలో బీజేపీ వస్తే మన హైదరాబాద్ ను లూటీ చేసి మనకు టోపీ పెడతారు అని ఆయన మండిపడ్డారు. ఇక, సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్ ను పెట్టింది.. కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది బీజేపీకే పోతుందన్నారు. సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్.. సెక్యులర్ లీడర్ కేసీఆర్.. మనసులో ప్రేమ ఉంటే కచ్చితంగా బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కేటీఆర్ కోరారు.