Revanth reddy: ఆచితూచి ఓటువేయకపోతే రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో జరుగుతున్న ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదని.. రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదం మెడపై కత్తిలా వేలాడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తుక్కుగూడ కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలను ఆదానీ, అంబానీలకు బానిసలుగా మార్చబోతున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Maruthi : నన్ను టార్చర్ పెట్టాడు.. కొరడాలతో కొడుతుంటాడు.. డైరెక్టర్ మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
‘‘విశ్వేశ్వర్ రెడ్డి ఇక్కడి వాడే.. కానీ ఆయన ఉన్నది బీజేపీ వైపు. రిజర్వేషన్ల రద్దుపై ప్రశ్నించిన నాపై ఢిల్లీ పోలీసులతో కేసులు పెట్టించారు. కేసులకు రేవంత్ రెడ్డి భయపడేవాడు కాదు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు… బ్రిటిష్ జనతా పార్టీ. బ్రిటిష్ వారిలాగే మన మధ్య పంచాయితీ పెట్టి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారు. బీజేపీ దేవుడిని అడ్డు పెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తోంది. అయోధ్యలో రాముడి ప్రతిష్ఠకు 15 రోజుల ముందే అక్షింతలు పంచి దేవుడిని అవమానించారు. బీజేపీ నేతలకు నేను సవాల్ విసురుతున్నా. నిజంగా రాముడి ప్రతిష్ఠ జరిగాకే అక్షింతలు తెచ్చారని భద్రాద్రి రాముడిపై ప్రమాణం చేయగలరా?, దేవుడంటే మీకు ఓట్లు.. రాముడంటే మీకు సీట్లు.. హనుమాన్ అంటే మీకు అధికారం కావొచ్చు.. కానీ మాకు రాముడు అంటే నమ్మకం. రాముడికి నమ్మిన బంటు హనుమంతుడిలా మేముంటాం. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి… అలాంటివారే నిజమైన హిందువులు.’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఇది కూడా చదవండి: Viral Video: “క్రెటా” అడిగితే “వ్యాగన్-ఆర్” ఇచ్చారని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరుడు..
‘‘తెలంగాణ తల్లిని అడ్డుపెట్టుకుని పదేళ్లు కేసీఆర్ దోచుకున్నారు. తండ్రి గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారు. కొడుకు జన్వాడలో వెయ్యి కోట్లతో ఫామ్ హౌస్ కట్టుకున్నారు. టీవీలు, పేపర్లు పెట్టుకున్నారు. వేల కోట్లు సంపాదించుకున్నారు. తెలంగాణ తల్లిని అడ్డుపెట్టుకుని దోచుకున్నోడు ఒకడైతే… రాముడిని అడ్డు పెట్టుకుని దేశాన్ని కొల్లగొట్టి ఆదానీ, అంబానీలకు లక్షల కోట్లు దోచి పెట్టినవాడు ఇంకొకడు. మీకు దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు ఎప్పుడైనా గుర్తొచ్చారా? , నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారా?, ఏం చేశారని బీజేపీకి ఓటు వేయాలి. తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేసిన మోడీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదు. గ్యారంటీలు అమలు చేయలేదని కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. నిన్ను కండక్టర్ టికెట్ అడిగితే మేము గ్యారంటీలు అమలు చేయనట్లే. టికెట్ అడగకపోతే గ్యారంటీలు అమలు చేసినట్లు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది.. మోడీ తెచ్చింది ఏమీ లేదు.. గాడిద గుడ్డు తప్ప.’’ అని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Bernard Hill : టైటానిక్ నటుడు మృతి
- Tags
- bjp
- BRS
- CM Revanth Reddy
- kcr
- ktr
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు