ఈ-కార్ రేసు వ్యవహారంలో ఎక్కడా అవినీతి జరగలేదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసులో హై కోర్టు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు అని చెప్పిందని హరీష్ రావు తెలిపారు. ఇది డొల్ల కేసు అని మొదట్లోనే తేలిపోయిందని హరీష్ రావు అన్నారు.
హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట లభించింది. పదిరోజులు(ఈనెల 30) వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ కేసులో విచారణ జరపాలని ఆదేశించింది. అలాగే.. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
ఈ-ఫార్ములా సంస్థతో జరిగిన కేటీఆర్ లోపాయికారీ ఒప్పందం అంతా ప్రజల ముందు పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో కేటీఆర్ ఈ-ఫార్ములా కేసుపై సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బీఏసీ మీటింగ్‌లో 9 అంశాలు ఇచ్చారు.. దీంట్లో ఈ ఫార్ములా గురించి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ ఫార్ములా ప్రతినిధి తనను కలిశారని.. ఎవరు వచ్చినా అందరినీ కలుస్తానని చెప్పారు. ఈ ఫార్ములా ప్రతినిధిని తన ఇంట్లో కలిశానని అన్నారు.
భూభారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకోవడంపై అక్బరుద్దీన్, కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో బీఆర్ఎస్పై అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల కోసమా..? కుటుంబం కోసం పోరాటం చేస్తున్నారా? అని దుయ్యబట్టారు. తాము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని అక్బరుద్దీన్ అన్నారు. మీ కుటుంబం కోసం అసెంబ్లీలో పోరాటం ఏమిటి..? అని ప్రశ్నించారు.
KTR Petition: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా-ఈ రేసు విషయంలో ఏసీబీ కేసును వ్యతిరేకిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే నాపై కేసు పెట్టారని కేటీఆర్ అన్నారు. ప్రైవేట్ సంస్థ కు లబ్ధి చేకూర్చామని ఎఫ్ఐఆర్లో చెప్పారు, కానీ ప్రైవేట్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదన్నారు. ఏసీబీ తో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ను ప్రతివాదిగా చేర్చారు. అగ్రిమెంట్ కు ముందు నిధులు FEO పంపడం ఉలంఘన…
Minister Seethakka: జైలుకు వెళ్లి యోగా చేస్తా అన్న కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారు? అని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చిట్ చాట్ లో మంత్రి సీతక్క మాట్లాడుతూ..
KTR: కేసు విషయంలో నేనేం భయపడడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్నటి మీడియా సమావేశం అవినీతి జరుగలేదని పొన్నం ప్రభాకర్ చెప్పారన్నారు.
Congress vs BRS: అసెంబ్లీ ప్రారంభం కాగానే ఫార్మలా ఈ కార్ రేస్ అంశంపై కాంగ్రెస్ మాట్లాడాలని బీఆర్ఎస్ పట్టుబడింది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ భారతి బిల్లుపై చర్చను ప్రారంభించారు.
Harish Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని అసెంబ్లీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేసి బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలని
ఫార్ములా ఈ రేస్ ఇష్యూపై తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు మూడు రోజులుగా తనపై కేస్ అని లీక్‌లు ఇస్తున్నారు.. నాలుగు గోడల మధ్య ఎందుకు.. అసెంబ్లీలో చర్చ పెట్టండి అని అడిగానన్నారు. ఈ క్రమంలో.. రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశానని కేటీఆర్ తెలిపారు. అయినా చర్చకు వచ్చే దమ్ము లేదు ప్రభుత్వానికి అని పేర్కొన్నారు.