KTR : ఫార్ములా ఈ-రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొనబడింది. కేటీఆర్‌తో పాటు, బీఎల్‌ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్‌లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం.
HMPV Virus: చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్.. లక్షణాలు, ఎవరికి ఎక్కువ ప్రమాదం..?
మరోవైపు, ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న హెచ్‌ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. గడువు కావడంతో వారు ఈమెయిల్ ద్వారా అభ్యర్థన పంపారు. ఈ నేపథ్యంలో వీరి విచారణను తాత్కాలికంగా వాయిదా వేసి, కొత్త తేదీలతో ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు.
ఫార్ములా-ఈ రేసు నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం లేకుండా, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే నిధులు మళ్లించారనే ఆరోపణలతో, మాజీ మంత్రి కేటీఆర్, హెచ్‌ఎండీఏ పూర్వ కమిషనర్ అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి పై అవినీతి నిరోధకశాఖ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ కేసులో ఈనెల 7న హాజరుకావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ నేపథ్యంలో ఏసీబీ సైతం నోటీసులు జారీ చేయడంతో ఫార్ములా ఈ రేసు కేసులో సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన సూచీలు