KTR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా అక్షరాల మార్పు కోసం 1000 కోట్ల రూపాయల ఖర్చు? రైతుల కోసం ‘రైతు భరోసా’ అమలు చేయలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, పింఛన్లు పెంచలేదు. ఇక ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కులేని కాంగ్రెస్ ప్రభుత్వం, అనవసరమైన విషయాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడిందా?” అని ప్రశ్నించారు.
Game Changer Event : సర్వం సిద్ధం.. ఆరోజు వేరు, ఈరోజు వేరు.. రీసౌండ్ రావాల్సిందే!
కేటీఆర్, రవాణాశాఖలో ‘టీఎస్’ బదులు ‘టీజీ’ అక్షరాల మార్పుపై ఖర్చు చేసిన నిధులను విమర్శించారు. “తెలంగాణ అస్థిత్వాన్ని చెరపడం కోసం వెయ్యి కోట్లు కాదు, లక్ష కోట్లు ఖర్చుపెట్టినా నాలుగు కోట్ల ప్రజల గుండెలపై ఉన్న కేసీఆర్ చేసిన సంతకాన్ని మీరు ఎప్పటికీ మార్చలేరు,” అని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ నేత రామ్ మోహన్ రెడ్డి కౌంటర్:
కేటీఆర్ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ నేత సామ రామ్ మోహన్ రెడ్డి స్పందించారు. “కోటికి వెయ్యి కోట్లకు తేడా తెలియనంతగా మాట్లాడతారా? ఇదేమిటి? కేటీఆర్ వ్యాఖ్యలు అసత్య ప్రచారానికి నిదర్శనం,” అంటూ సోషల్ మీడియా వేదికపై తీవ్రంగా ప్రతిస్పందించారు.