పాన్ ఇండియా స్టార్ పుష్ప (అల్లు అర్జున్) అరెస్ట్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. RRR అలైన్మెంట్ మార్చి రైతులను మోసం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసిందని ఎంపీ దుయ్యబట్టారు. RRR విషయంలో దోచుకునే, దాచుకునే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదని అభిప్రాయపడ్డారు. RRR 7 వేల కోట్ల ప్రాజెక్టు.. కానీ కాస్ట్ కంటే ఎక్కువ 12 వేల కోట్లు తిన్నారని కేటీఆర్ అంటున్నారు.. కేటీఆర్ పిచ్చి మాటలు చూస్తే.. భయం వెంటాడుతుంది అని తెలిసిపోతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని బతికిస్తుంది.. వాళ్ల లాగా తప్పుడు కేసులు బనాయించే పార్టీ కాదని పేర్కొన్నారు. తమ తప్పులు ఉంటే ప్రతిపక్షాలు హెచ్చరించాలి తప్ప.. కేవలం రాజకీయం కోసమే మాట్లాడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Read Also: Anna University Case: లైంగిక వేధింపుల కేసుని రాజకీయం చేస్తున్నారు.. హైకోర్ట్ ఫైర్..
కేటీఆర్, హరీష్, కవిత ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ చామల ఆరోపించారు. కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసు పై ఒక్కో రోజు ఒక్కో స్టేట్మెంట్ ఇస్తున్నాడు.. రూ.56 కోట్లు బదిలీ చేసింది వాస్తవం అంటావు.. అవినీతి లేదు అంటావు.. రూపాయి కూడా ట్రాన్స్ఫర్ జరగలేదు అంటావు.. మొదట్లో నేనే అరవింద్ కుమార్‌కి డబ్బులు విడుదల చేయండని అన్నారు.. తర్వాత నాకేం సంబంధం అంటున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ తప్పు చేయకపోతే నేను కూడా కోరుకుంటున్నా.. ఆయన నిర్దోషిగా నిరూపించుకోండని తెలిపారు. తప్పు చేస్తే.. కచ్చితంగా జైలుకు వెళ్తారని ఎంపీ ఆరోపించారు. బీఆర్ఎస్ హయములో ఐఏఎస్ అధికారులకు సింగల్ విండో ద్వారా ఆదేశాలు వెళ్ళేవి.. తమ హయంలో మల్టీఫుల్ నుండి ఆదేశాలు ఐఏఎస్‌లకు ఆదేశాలు వెళ్తాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: CM Chandrababu: కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం ప్రత్యేక భేటీ.. ఏం చేద్దాం..?