ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు.. రేపు ఈడీ విచారించనుంది. ఫార్ములా ఈ రేస్ కేసుల్లో ఈ రెండు సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి.
Aadi Srinivas : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న మాట్లాడిన కేటీఆర్ మాటల్లో బేలాతనం కనిపిస్తుందన్నారు. జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో పది రకాల భూములు కబ్జా కలేదా గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలని, మీరు కట్టి తెలంగాణ భవనం ఆక్రమించిన స్థలంలో కట్టారన్నారు ఆది శ్రీనివాస్. చిత్త శుద్ధి…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. తాము అనుమానించినట్లు గానే కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచన, మోసంకు పర్యాయపదం అని రుజువు అయిందని అన్నారు.
Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న ప్రభుత్వ చర్యలపై మాట్లాడారు. ఆయన రైతు భరోసా పథకం గురించి మాట్లాడుతూ.. రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదని, సాగుకు యోగ్యమైన భూమికి రైతు భరోసా ఇస్తున్నాం అని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మరొక ముఖ్యమైన విషయం చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచినా, రాష్ట్ర ఆర్థిక…
కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి విశ్వాసం, చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం.. కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు మళ్ళీ వస్తాయని అన్నారు. ఏడాది అయినా కేసీఆర్ జపం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం దివాలా తీసిందని చెప్పే ముఖ్యమంత్రి.. పరిపాలన చేతకాకే మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు.
Komatireddy Rajgopal Reddy : తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో తమ ప్రభుత్వం కక్షసాధింపుల రాజకీయాలకు దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. కానీ గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పక్షపాత చర్యలకు పాల్పడి, ప్రతిపక్షాలను పూర్తిగా క్షీణింపజేసే కుట్రలకు తెరతీసిందని ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలపాలుచేసి తమ పార్టీలోకి చేరుస్తూ ప్రజాస్వామ్య విలువలను తుంగతీసిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్…
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా అక్షరాల మార్పు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా అక్షరాల మార్పు కోసం 1000 కోట్ల రూపాయల ఖర్చు? రైతుల కోసం ‘రైతు భరోసా’ అమలు చేయలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, పింఛన్లు పెంచలేదు. ఇక ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కులేని కాంగ్రెస్ ప్రభుత్వం, అనవసరమైన విషయాల కోసం వేల…
KTR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా అక్షరాల మార్పు కోసం 1000 కోట్ల రూపాయల ఖర్చు? రైతుల కోసం ‘రైతు భరోసా’ అమలు చేయలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, పింఛన్లు పెంచలేదు. ఇక ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కులేని కాంగ్రెస్ ప్రభుత్వం, అనవసరమైన విషయాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడిందా?”…
KTR : ఫార్ములా ఈ-రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొనబడింది. కేటీఆర్‌తో పాటు, బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్‌లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం. HMPV Virus:…
Shabbir Ali : ఫార్ములా ఈ రేస్ కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అరవింద్‌కి డబ్బులు బదిలీ చేయమని తానే చెప్పానని, కోర్టులో మాత్రం తనకేం సంబంధం లేదని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా కేటీఆర్‌కి నీతి లేదు అని ఆయన తీవ్రంగా…