KTR: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్కు మన్మోహన్ సింగ్తో ఎంతో సాన్నిహిత్యం ఉండేదని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మన్మోహన్ లాంటి మహానుభావుడిని కోల్పోవడం దేశానికి తీరని లోటని అన్నారు.
KTR Quash Petition: ఫార్ములా-ఈ రేసు కేసు విచారణ మంగళవారానికి (31)కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారించింది.
కేటీఆర్ క్వాష్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ.. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు శుక్రవారం విచారించనుంది. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ ఈ నెల 21న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఈ కేసును విచారించిన జస్టిస్ శ్రవణ్ కుమార్ ధర్మాసనం.. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని, అయితే విచారణ కొనసాగించవచ్చని ఆదేశించింది. కౌంటర్…
Patnam Narendar Reddy : ఆరు గ్యారంటీ ల గురించి అసెంబ్లీలో చర్చ సైడ్ ట్రాక్ మళ్లించేందుకే అల్లు అర్జున్ పై అనవసర చర్చ పెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డి పై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తప్పు పట్టారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్ష్యసాదింపులో భాగంగానే లగచర్ల కేసులో…
Formula-Car Race Case: ఫార్ములా-ఈ రేసు కేసులో కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏసీబీ అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు అందాయి. ఈ ఫార్ములా కేసులో ఫిర్యాదుదారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేశారు.
నేడు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించనున్న సీఎం. ప్రొ కబడ్డీలో నేటి మ్యాచ్లు.. రాత్రి 8 గంటలకు గుజరాత్ వర్సెస్ ఢిల్లీ. రాత్రి 9 గంటలకు పుణెరి-తమిళ్ తలైవాస్. ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ విచారణ. నేడు దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం. మరి కొంతమంది అధికారులను విచారించనున్న ఏసీబీ. కేటీఆర్కు నేడు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఈడీ. నేడు పెనమలూరు…
అసెంబ్లీ సమావేశాల అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. శాసన సభ చరిత్రలో ఎప్పుడు చెప్పని విధంగా అబద్ధాలు చెప్పారని కేటీఆర్ అన్నారు. రైతుబంధు డబ్బులు ఎగ్గొట్టారు.. రైతుబంధు దుర్వినియోగం అయ్యిందని ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. పత్తి రైతులు ఎనిమిది నెలలు పంట పండిస్తారు.. పత్తి రైతులకు రెండో విడత రైతుబంధు ఇవ్వరా? అని ప్రశ్నించారు.
మూసీ మురుగు నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కల్పిద్దామంటే బీఆర్ఎస్ కాళ్లలో కట్టెలు పెడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన చేస్తా అంటే వద్దు అంటారు.. ఫ్యూచర్ సిటీ వద్దు అంటారు.. రుణమాఫీ వద్దు అంటారు.. ఇండస్ట్రీ పెడతా అంటే వద్దు అంటారు.. ఏం చేయాలి మరి అని ముఖ్యమంత్రి మండిపడ్డారు. తాను నల్లమల నుండి వచ్చానని... ఇక్కడ తొక్కితే అక్కడికి పోయారు వాళ్ళు అని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.
Payal Shankar: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అంటే ఏమనుకుంటున్నావ్ కేటీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫార్ములా ఈ-కార్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ. ఫార్ములా ఈ-కార్ రేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ-కార్ రేసులో ప్రమేయం ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ECIR నమోదు చేసినట్లు ఈడీ పేర్కొంది.