గత ప్రభుత్వ హయాంలో ఈ-ఫార్ములా రేసు కోసం విదేశీ కంపెనీకి నిబంధనలతు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ-ఫార్ములా రేసు నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా కేబినెట్ సమావేశం జరిగింది. డిసెంబర్ 28న భూమిలేనివారికి రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదని.. చంద్రబాబు రాగానే ఏపీకి పోతుంది అనేది ప్రచారం మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలో వరద వల్ల ఏపీకి ఇన్వెస్ట్మెంట్ వెళ్లే పరిస్థితి లేదన్నారు. అమరావతిలో వరద వల్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్లకు భయం పట్టుకుందని మంత్రి అన్నారు.
తమ భూమి తమకే ఉండాలని కొట్లాడిన పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారన్నారు. లగచర్ల ఘటనపై చర్చ పెడదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
Addanki Dayakar : పుష్ప 2 ప్రీమియర్ తొక్కిసలాటలో మహిళ మృతి కేసులో ఐకాన్ స్టార్ అర్జున్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. అల్లు అర్జున్ అరెస్ట్పై సినీ, రాజకీయ ప్రముఖలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. అల్లు అర్జున్ అరెస్ట్పై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. చట్టం తనపని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంల కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి…
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను హైదారాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సంధర్భంగా అల్లు అర్జున్ హైదరాబాదు సంధ్య థియేటర్ కి వెళ్ళారు. ఆయన వస్తున్నారని తెలిసి టికెట్ లేని వారు సైతం ఆయనను చూసేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఒకానొక సందర్భంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు ఇప్పటికీ…
Chamala Kiran Kumar Reddy: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు.
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం పరిస్థితి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్రమైన విమర్శలు చేసారు. ఆయన రాహుల్ గాంధీకి రాసిన బహిరంగ లేఖలో కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో ప్రతివర్గాలకు ముప్పు తెస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతుల నుండి మహిళల వరకు అన్ని వర్గాలు కాంగ్రెస్ సర్కార్ వల్ల అరిగోస పడుతోందని చెప్పారు. ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ పయనంలో రాష్ట్రం దిగజారిపోయిందని, ప్రజల సమస్యలపై కాంగ్రెస్ నేతలు పట్టించుకోకుండా ఢిల్లీకి, ప్రభుత్వ…