ప్రధాని సభకు రావాలంటూ జగన్‌కు ఆహ్వానపత్రిక.. పీఏకు ఇచ్చి వెళ్లిన అధికారులు అమరావతిలో శుక్రవారం రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇక రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌ను కూడా ఆహ్వానించింది. శుక్రవారం జరిగే ప్రధాని మోడీ సభకు రావాలంటూ తాడేపల్లిలోని…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ ఏడాది జూన్ 20, 21 తేదీలలో ఇంగ్లాండ్‌లో నిర్వహించబడనున్న ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ (Oxford India Forum) సదస్సుకు ముఖ్యఅతిథిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. “భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సదస్సును ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ సేఠి ప్రకటించారు. కేటీఆర్ తన అనుభవాలను, ఆలోచనలను ఈ సదస్సులో భాగంగా వివిధ దేశాల నిపుణులు,…
BRS Silver Jubilee Meeting: ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి.. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటం చేసి.. ఎన్నో అవమానాలు ఎదురైనా.. ఉద్యమమే ఊపిరిగా.. రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న కసితో పోరాడి చివరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది భారత రాష్ట్ర సమితి.
KTR: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓరుగల్లు వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో రేపు (ఏప్రిల్ 27వ తేదీన) నిర్వహించబోతున్నారు. ఈ రజతోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారు పార్టీ.. తన బలం, బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశమంతా మరోసారి చూపించాడానికి సిద్ధమైంది.
V. Srinivas Goud: రజతోత్సవ సభతో తెలంగాణ ప్రజల్లో మళ్ళీ ఆశలు చిగురించాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ తమకు అండగా ఉన్నారు అనే ధైర్యం మళ్ళీ ప్రజల్లో కలుగుతోంది.. కేసీఆర్ ప్రసంగం వినేందుకు లక్షలాదిగా రేపు వరంగల్ సభకు తరలి రానున్నారు.
కేసీఆర్ సభ పైనా ప్రజల కంటే కాంగ్రెస్ నాయకులకే ఇంట్రెస్ట్ పెరిగింది అని సెటైర్ వేశారు. కేసీఆర్ ఏం మాట్లాడుతారు అని కాంగ్రెస్ నేతలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని హరీష్ రావు తెలిపారు.
Komitreddy Venkat Reddy : బీఆర్ఎస్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నదుల అభివృద్ధి , సంరక్షణ సంస్థ (NDSA) నివేదికలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన డొల్లతనం పూర్తిగా బహిర్గతమైందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలకు అబద్ధాలు చెప్పడం తప్ప మరేమీ తెలియదని ఎద్దేవా చేశారు. నివేదిక ఆధారంగా తప్పిదాలపై తప్పకుండా చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ఎనిమిదో వింతే అని వ్యాఖ్యానించిన కోమటిరెడ్డి.. మూడు సంవత్సరాల్లో నిర్మించి, రెండు సంవత్సరాల్లో కూలిపోయే…
బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ ఎవరు?..జాతీయ అధ్యక్షుడు ఎవరు? అని ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కేటీఆర్ దమ్ముంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పదవి తెచ్చుకో అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి లాగ పీసీసి అధ్యక్షుడు అయిన రెండు సంవత్సరాలలో ముఖ్యమంత్రివి కావాలన్నారు. మీడియాతో మాట్లాడిన అద్దంకి.. బీఆర్ఎస్, కేటీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు, ఇప్పుడు పీసీసీ అధ్యక్షులు బీసీలే అన్నారు. దమ్ముంటే తమ పార్టీలో బీసీని లేదా ఎస్సీని రాష్ట్ర…
బీఆర్ఎస్ అధిష్టానం దేన్నుంచో తప్పించుకోబోయి… ఇంకెక్కడో ఇరుక్కుపోయిందా? హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక పార్టీని ఇరికించేసిందా? ఇప్పుడు గులాబీ పార్టీకి కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏంటి? దాని గురించి అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటి? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ముగిసినా… పొలిటికల్ ప్రకంపనలు మాత్రం రేగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ వైఖరి చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లే ప్రధాన ఓటర్లు. ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఈ స్థానం నుంచి…