ఇటీవల మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. కొన్ని రోజుల క్రితం తమ బంధువుల అబ్బాయికి ఉద్యోగం కావాలని మంత్రి శ్రీధర్ బాబును కోరడం ఆ వ్యాఖ్యలు కాస్త వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు మంత్రులు కమిషన్ తీసుకుంటారు అనే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా.. ఏ ఫైల్ కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.…
KTR: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, మాజీ మంత్రి, సిద్ధిపేట్ ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు హరీష్ రావుతో సమావేశం అయినట్లు తెలుస్తుంది.
KTR: వరంగల్లో గురువారం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. మంత్రులు డబ్బులు తీసిన తర్వాతే ఫైళ్లపై సంతకాలు పెడతారని ఆమె చెప్పిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా శుక్రవారం స్పందించారు. కొండా సురేఖ మాట్లాడిన కొన్ని నిజాలకు అభినందనలు అని, తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ “కమీషన్ సర్కార్” నడుస్తోందని విమర్శించారు. 30 శాతం…
Konda Surekha : బీఆర్ఎస్ పార్టీపై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు చేశారు. సిఎస్ఆర్ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొంటూ, తాను ఎప్పుడూ మంత్రులు కమిషన్ తీసుకుంటారని మాత్రమే వ్యాఖ్యానించానని, కాంగ్రెస్ మంత్రులను ఉద్దేశించి కాదని స్పష్టంచేశారు. అయితే తన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు చెందిన కొంతమంది నేతలు తప్పుడు వీడియో ఎడిటింగ్తో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను చెప్పిన మాటల్ని అసంపూర్ణంగా ప్రచారం చేసి…
తెలంగాణ ఉద్యమ సమయంలోను, ఆ తర్వాత అధికారంలో ఉన్న పదేళ్ళు తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది బీఆర్ఎస్. కానీ... 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డాయి పార్టీ శ్రేణులు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో పాటు... తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలామంది నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీని వదిలేసి వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అలాంటి వలసలు ఉక్కిరిబిక్కిరి చేసినా... ఈ మధ్య కాలంలో ఆ…
వరంగల్ జిల్లాలో అందాల భామల హెరిటేజ్ వాక్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కావాలనే కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ట్రబుల్ షూటర్.... ఈ మాట వినగానే..... కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చే పేరు హరీష్రావు. ఉద్యమ సమయంలో... కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చేరింది బీఆర్ఎస్. అప్పుడు ఎమ్మెల్యేగా కూడా లేని హరీష్రావుని మంత్రిని చేశారు కేసీఆర్. అలాగే హరీష్ కూడా మామకు నమ్మిన బంటు అనడంలో ఆశ్చర్యం లేదంటారు పొలిటికల్ పండిట్స్.
Anugula Rakesh Reddy : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో రోడ్డు పక్కన ఉన్న పేద ప్రజల షాపులను కూల్చివేయడం గమనార్హం. ఈ నిర్ణయంతో ఈ ప్రాంతాల పేదలకు చెందిన వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఈ చర్యకు సంబంధించిన వివిధ ప్రశ్నలు ప్రజల్లో , రాజకీయ వర్గాల్లో చర్చించబడుతున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ..”అందగత్తెల కోసం పేదల షాపులను కూల్చడం ఏమిటి?” అని ప్రశ్నించారు. ఆయన అభిప్రాయానికి, అందగత్తెలతో రాష్ట్రానికి…
KTR: తెలంగాణలో పేద ప్రజల ఇళ్లపై బుల్డోజర్లతో నిర్వహిస్తున్న కూల్చివేతలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్రంగా విమర్శించారు. వరంగల్ నగరంలో రోడ్డుకే ఆనుకుని ఉన్న పేదవారి ఇళ్లను కూల్చివేసిన ఘటనలపై సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) లో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని కేటీఆర్ నేరుగా ప్రశ్నించారు. “హలో రాహుల్ గాంధీ, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందం ఉందా?” అంటూ ఆయన తన…
పెద్దపల్లి జిల్లా.. కోల్ బెల్ట్ ఏరియాతో పాటు అటు పారిశ్రామికంగానూ.. ఇటు వ్యవసాయ పరంగానూ ప్రాధాన్యత ఉన్న ప్రాంతం.... తెలంగాణ ఏర్పడ్డాక ఈ జిల్లాలో గణనీయమైన విజయాలు సాధించింది బీఆర్ఎస్. రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాలు పూర్తిగానూ, ధర్మపురి పాక్షికంగానూ ఈ జిల్లా పరిధిలో ఉన్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లా పరిధిలో ఒక్క సీటు కూడా గులాబీ పార్టీకి దక్కలేదు.