తెలంగాణ మహిళలతో అందాల భామల కాళ్లు కడిగిస్తారంటూ బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ఇది తీవ్ర అవమానకరమని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మిస్ వరల్డ్ పోటీదారులు ములుగు, రామప్ప దేవాలయ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా రామప్ప దేవాలయంలోకి వెళ్లే ముందు అందాల భామలు కాళ్లు కడుక్కుని వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళలు నీళ్లు పోయడం వివాదాస్పదమైంది.
తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి సీతక్క స్పందిస్తూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో అందాల భామల హెరిటేజ్ వాక్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కావాలనే కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Pawankalyan : ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ పాల్గొనేది అప్పటి నుంచే..!
ఇవాంక ట్రంప్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె వెంట తిరిగిన నాయకుడు ఎలాంటి సంస్కృతి సంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసన్నారు. గిరిజన సంప్రదాయంలో గుడిలోకి వెళ్లే ముందు కాళ్లు కడుగుకొని వెళ్లడం సంప్రదాయం.. అదే అక్కడ పాటించారన్నారు. ఆ సమయంలో ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ అమ్మాయి.. కాళ్లకు నీళ్లు పోసిందని.. దాన్ని పట్టుకుని నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం కాళ్లు కడిగిస్తే.. అందరి కాళ్లు కడిగించాలి కదా? కానీ అక్కడ అలా జరగలేదన్నారు. అయినా దాన్ని ప్రభుత్వానికి అంటగట్టడం సిగ్గు అనిపించడం లేదా? అని బీఆర్ఎస్ నేతలపై ఫైరయ్యారు.
ఇది కూడా చదవండి: Nithin : తీవ్ర సమస్యల్లో ‘తమ్ముడు’.. విశ్వంభర వస్తే ఎలా..?
కవితమ్మ కాళ్ల దగ్గర కలెక్టర్‌ను కూర్చోబెట్టినప్పుడు.. కేసీఆర్ కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకోవడం మీ దుహంకారం కాదా? ఈ తీరు నచ్చకే కదా ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారని పేర్కొన్నారు. అసలు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత మీకుందా? తెలంగాణ పేరునే మీ పార్టీ పేరులో నుంచి తీసేశారు కదా? అని ప్రశ్నించారు. ఈ మధ్య సబితా ఇంద్రారెడ్డి ములుగు మీద పచ్చి అబద్ధాలు చెబుతున్నారని.. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏం మానవత్వం చూపిందో తెలుసన్నారు. వాస్తవాలు మాట్లాడాలని.. అబద్ధాలు కాదని హితవు పలికారు. ఇప్పటికైనా అబద్ధాలకు అంబాసిడర్‌గా సబితమ్మ మారొద్దన్నారు. అధికారం పోయాక ప్రజల ఆత్మగౌరవం గుర్తొచ్చిందా? అంటూ మంత్రి నిలదీశారు.