KTR: ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో నిర్వహించిన కీలక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించండి అన్నా
కేటీఆర్ కు నాయకత్వం అప్పగిస్తే సహకరిస్తాను అని తేల్చి చెప్పారు. నేను క్రమ శిక్షణ గల పార్టీ కార్యకర్తను.. గత 25 ఏళ్లుగా పార్టీలో నిబద్ధతో పని చేస్తున్నాను.. నా లీడర్ కేసీఆర్.. ఆయన చెప్పినట్లు నడుచుకుంటానని హరీశ్ రావు తెలిపారు.
తెలంగాణలో రాజకీయ అగ్గి ఈసారి డిఫరెంట్‌గా రాజుకోబోతోందా అంటే... అవును... అలాగే కనిపిస్తోందని చెబుతున్నారు పొలిటికల్ పరిశీలకులు. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటున్నారు. తాజాగా మీడియాతో కవిత అన్న మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సామాజిక తెలంగాణ విషయమై ఈనెల మొదట్లో కవిత అన్న మాటల సెగలే ఇప్పటికీ తగ్గలేదు.
తెలంగాణలో పదేళ్ళు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్... ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది. అందుకు కారణాలపై ఇప్పటికే పోస్ట్‌మార్టం పూర్తి చేసిన గులాబీ అధిష్టానం... జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునే కార్యక్రమం మొదలుపెట్టిందట.
తొందర్లోనే స్థానిక ఎన్నికలు వస్తాయని, స్థానిక ఎన్నికల్లో సీరియస్‌గా పోటీ చేస్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏళ్లు మోసపోయాం అని, మళ్లీ మోసపోవద్దని కేసీఆర్ చెప్పారని.. కానీ తాత్కాలికంగా మోసపోయాం అని పేరొన్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని, రుణమాఫీ కూడా చేయలేకపోయిందని మండిపడ్డారు. రైతుబందు మొదటి పంటకే గతి లేదు అని ఎద్దేవా చేశారు. పేదలకు అండగా నిలిచేది బీఆర్ఎస్…
మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తిప్పికొట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు.గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. కేసీఆర్ అప్పు.. తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించిందన్నారు. కేసీఆర్ నిర్వాహకం వల్ల నెలకు 6 వేల కోట్ల ప్రజాధనాన్ని అప్పల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వస్తుందన్నారు. సత్తా ఉన్న…
KTR : తెలంగాణ రాజకీయ వేడి మరోసారి పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యక్తిగత దూషణలు, విమర్శలు వచ్చినా సహించామని, కానీ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక ఈ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పార్టీలకతీతంగా పాల్గొన్నా వాస్తవాన్ని గుర్తుచేస్తూ, అలాంటి నేతలపై ముఖ్యమంత్రి చేసిన…
Addanki Dayakar: జనగామ జిల్లా పాలకుర్తిలోని బృందావన్ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ తీరును తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఆ సభలో కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావులకు కూడా మాట్లాడే అవకాశం…
KTR : నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెంబి మండలం లోతేర తండాకు చెందిన అక్కాచెల్లెళ్లు బాణావత్ మంజుల, బాణావత్ అశ్వినీలు శుక్రవారం ఎంసెట్ పరీక్ష రాసి తిరిగే సమయంలో ఆర్మూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బాధిత కుటుంబానికి పూర్తి మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చిన కేటీఆర్, మృతుల తండ్రి బాణావత్ రెడ్డి ఉపాధి నిమిత్తం…