బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ పార్టీపై, కేంద్ర ప్రభుత్వం విధానాలపై టీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇటీవల కేంద్రం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. దీనిపై ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు కేటీఆర్. ప్రతపక్ష పార్టీలు, దేశంలోని నిరుద్యోగ యువత కేంద్రంపై భారీ ఒత్తిడి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.…
https://youtu.be/DYnVB9hURP8 పుడమిని రక్షించుకుందాం అని సద్గురు జగ్గీ వాసుదేవ్ పిలుపు ఇవ్వడంతో ప్రముఖులు కదలివచ్చారు. ఏటా సుమారు 27 వేల జీవ జాతులు అంతరించిపోతున్నాయి. సారవంతమైన భూమిలో కనీసం 3 నుంచి 6 శాతం సేంద్రియ పదార్థం ఉండాలి. కానీ.. భారత్ లోని భూముల్లో సుమారు 0.65 శాతం మాత్రమే సేంద్రియ పదార్థం ఉంది. ఫ్రెంచ్ లో మట్టిని కాపాడుకునేందుకు పాలసీలు చేసినా ఆచరణలో మాత్రం ముందుకు కదలలేదు. మట్టిని కాపాడటం గురించి మన పిల్లలకు చెప్పడంకంటే…
ప్రతిభకు ఆకాశమే హద్దు.. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం అని సూచించారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రతిభకు ఆకాశమే హద్దు.. వచ్చే మూడు నాలుగు నెలలు మొబైల్ వాడకాన్ని తగ్గించండి.. 3 నెలలు ప్రణాళిక బద్ధంగా కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ పటిష్టత కోసం ఆ పార్టీ నాయకత్వం కృషిని ప్రారంభించింది. పార్టీలో అసంతృప్తి వాదులుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి లు పార్టీ కార్యాలయానికి వచ్చేలా చేయడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. ఇది పార్టీ లో ఒక్కవిజయంగా కూడా చెప్పవచ్చు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నప్పటికి పార్టీలో ఎటువంటి పదవులు లేకుండా ఉన్న వారిని కూడా దగ్గరకు తీసుకునే చర్యలు పార్టీ చేపట్టినట్లుగా అయ్యింది. పోలీసుల వినియోగాన్ని…
ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో KCR జాతీయ రాజకీయాల్లోకి రానున్నాడన్న విషయం పై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఖమ్మంలో కూడా KTR కూడా ఇదే విషయం పై ప్రస్తావించడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్ గా నిలిచింది. గత కొన్ని నెలల నుండే ఈ ప్రస్తావన ఉన్నప్పటికీ KTR వ్యాఖ్యలతో ఈ అంశం మరింత జోరందుకుంది. ఇక ఇందులో భాగంగానే .. భారతదేశం కూడా తెలంగాణ మోడల్ గా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్…
మంత్రి కేటీఆర్ పై నిరాధార వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్ కోర్టు బండి సంజయ్ సహా పలువురికి స్పష్టం చేసింది. ఈ మేరకు కేటీఆర్ వేసిన దావాలో మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. సామాజిక మాధ్యమం ట్విట్టర్లో మే 12న తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సిటి సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. కాగా.. మే 12న…
సీఎం కొడుకుతో చెప్పించుకునే పరిస్థితుల్లో బీజేపీ లేదని నిజామాబాద్ ఎంపీ బిజెపి ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అవసరమైనప్పుడు కేటీఆర్ సలహాలు తీసుకుంటామని మండిపడ్డారు. సస్పెండ్ ఎవర్ని చేయాలో.. ఎవరకి బాధ్యతలు ఇవ్వాలో బీజేపీ నాయకత్వానికి తెలుసని నిప్పులు చెరిగారు. తెలంగాణలో అత్యాచారాలపై ప్రభుత్వం పెద్దలు ఏమి సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తోన్న ఉచిత రేషన్ బియ్యాన్ని ముఖ్యమంత్రి కొడుకు బ్లాక్ మార్కెట్ చేసుకుంటున్నాడని విమర్శించారు. గ్రూప్ వన్ పరీక్షలో ఉర్థూ…
తెలంగాణ ఏర్పడ్డ తరువాత కరెంటు కోత ఉండకుండా ఉండేందుకు నిర్మించిన పవర్ ప్రాజెక్టులపై వివాదాలు ముసురుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టుపై అధికార పార్టీలు అయిన టీఆర్ఎస్ బిజెపిల మధ్య వార్ కొనసాగుతుంది. ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ.. బీజేపీ ఆధ్వర్యంలోని శాఖల ఆధ్వర్యంలోనే పనులు జరిగాయి కదాఅని టీఆర్ఎస్ లు వాద ప్రతివాదాలు చేసుకుంటున్నారు. కాగా.. తెలంగాణ ఏర్పడ్డ తరువాత తెలంగాణలో కరెంటు దొరకదని ఆనాడు ఆంధ్ర వాదులు, అక్కడి…
తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి చురుగ్గా పాల్గొంటున్నారు. ఐదో విడుత పల్లె ప్రగతిలో మోరీలను సాఫ్ చేస్తూ.. పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ..ప్రజలను భాగస్వాములను చేస్తూ.. ఉత్తేజ పరుస్తూ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతిలో భాగంగా ఆదివారం జనగామ జిల్లా…