మరోమారు రాష్ట్రానికి రాహుల్ గాంధీ రానున్నారు. కేటీఆర్ ఇలాకా టార్గెట్ గా ఎంచుకున్నారు రాహుల్. కాగా.. సెప్టెంబర్ లో మరోసారి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ రానున్నారు. అయితే.. మంత్రి కేటీఆర్ నియోజకర్గమైన సిరిసిల్లకు సెప్టెంబర్ 17న ఆయన రానున్నారు. కాగా.. అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్ను విడుదల చేయనున్నారు. ఇది ఇలావుండగా.. మరోవైపు టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు…
డబుల్ ఇంజన్ పాలన అంటే తిరోగమన పాలన అంటూ బీజేపీ పై మంత్రి హరీష రావు మండిపడ్డారు. అమిత్ షా నిధులు మీకు అందాయా అని అడిగే కంటే ముందు, తెలంగాణ కు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా చెప్పండని ప్రశ్నించారు. నియామకాల గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపి కి లేదని మండిపడ్డారు. మోడీ రెండు కోట్ల ఉద్యోగాల నియామకాల ప్రకటన బోగస్ అంటూ విమర్శించారు. మా వైపు ఒక్క వేలు చూపిస్తే.. మీ వైపు రెండు…
బీజేపీ విజయ సంకల్ప సభ వేదికగా బీజేపీ శ్రేణులు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఎం మోడీ సహా కేంద్ర మంత్రులు ఎవ్వరూ రాష్ట్రానికి ఉపయోగపడే మాట ఒక్కటి కూడా చెప్పలేదని విమర్శించారు. కాగా.. తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మారుస్తామన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. అంతేకాకుండా.. అహ్మదాబాద్ పేరును అదానీబాద్గా ఎందుకు మార్చారంటూ ట్వీట్ చేశారు. కాగా.. సభసమావేశాల్లో…
రాష్ట్రం పై రాక్షసులు పడ్డట్టు బీజేపీ నేతలు దాడి చేస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు. మోదీ కంటే ముందే సీఎం కేసీఆర్ రాజకీయాల్లో వచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్న నాయకుడు మంత్రి కేటీఆర్ అని వెల్లడించారు. అంతేకాకుండా.. ఆర్థిక క్రమశిక్షణను తెలంగాణ అద్భుతంగా పాటిస్తున్నదని చెప్పారు. కాగా.. కేంద్రం ఇస్తున్న అవార్డులే తెలంగాణ ప్రగతికి నిదర్శనమని వివేకానంద చెప్పారు. read…
మోడీని చూసి పెద్ద పరిశ్రమలు పారిపోతున్నాయని, బీజేపీ ప్రభుత్వం పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. నేడు (శనివారం) జలవిహార్లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన సభను నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. మీ కారణంగా దేశ ప్రజలు తలదించుకోవాల్సి వస్తోందని ఆగ్రమం వ్యక్తం చేశారు. మీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని మండిపడ్డారు. మేకిన్ ఇండియా అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించారు.పెద్ద కంపెనీలన్నీ దేశం నుంచి వెళ్లిపోయాయని విమర్శించారు.…
నేడు విపక్షాల రాష్ట్ర పతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ తో పటు పలువురు టీఆర్ఎస్ నేతలు స్వయంగా బేగంపేట ఎయిర్పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలికారు. కాగా.. టీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హన్మంతరావు యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకడం ఆసక్తికరంగా మారింది. అయితే.. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పిలిపించిన వారితో మేము…
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ .. టీఆర్ఎస్ మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుండి బైక్ ర్యాలీ మొదలైంది. బైక్ ర్యాలీలో యశ్వంత్ సిన్హా, సీఎం కేసీఆర్, కేటీఆర్ పాల్గొన్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జలవిహార్ వరకు దాదాపు ఐదు వేల మంది భారీ బైక్ ర్యాలీగా బయలు దేరారు. అయితే ఈ…
నేడు భాగ్యనగరానికి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు యశ్వంత్ సిన్హా చేరుకుంటారు. సిన్హాకు స్వాగతం పలికేందుకు స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. అనంతరం బేగం పేట్ నుంచి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టిఆర్ఎస్ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేయనున్నారు. అనంతరం 3.30 గంటలకు ఐటీసీ కాకతీయలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో…