తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కాకతీయ వైభవ సప్తాహం వేడుకల్లో భాగంగా కాకతీయుల విశిష్టతను తెలిపేలా.. మాధాపూర్ లో చిత్రమయి స్టేట్ ఆర్ట్‌గ్యాలరీలో ఛాయాచిత్ర ప్రదర్శనను కాకతీయుల 22వ వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ తో కలిసి శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. చరిత్ర పరిశోధకుడు అరవింద్ ఆర్య తీసిన 777 ఫొటోలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. అరవింద్ ఆర్యను మంత్రి కేటీఆర్ సన్మానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాకతీయుల విశిష్టతను చాటే కళాసందను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, కొన్ని చిత్రాలు చూస్తుంటే సంతోషం కలిగిందన్నారు. అయితే.. చాలా మందిరాలు, ప్రాంగణాలు కూలిపోయినా పట్టించుకోని పరిస్థితి మరికొన్ని ఛాయాచిత్రాల్లో కనిపించిందన్నారు. అలాంటి వాటిని చూస్తే బాధ కలుగుతోందని, సిగ్గనిపిస్తోందని పేర్కొన్నారు. కాగా.. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదాను సంపాదించడం మనం సాధించిన అతిగొప్ప విజయాల్లో ఒకటన్నారు.
read also: Live: వైసీపీ ప్లీనరీ సమావేశాలు l YSRCP Plenary Meeting 2022 Day 1 l Ntv Live
మరికొద్ది ప్రాంతాల్లో మైనింగ్ కారణంగా అక్కడ ఉండే కట్టడాలు, శిల్పాలకు ప్రమాదం ఉందని, వాటిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా సంక్షేమానికి, మానవీయ స్ఫూర్తికి మారుపేరుగా నిలిచిన కాకతీయ పాలకులను ఇప్పటికీ తెలంగాణ సమాజం గర్వంగా తలుచుకుంటుందని అన్నారు. కాకతీయుల స్ఫూర్తి తోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ పేరుతో రాష్ట్రంలోని చెరువుల పునురుద్ధరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు, నన్నపునేని నరేందర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Mahbubnagar: వరదలో చిక్కుకున్న పాఠశాల బస్సు.. బస్సులో 25 మంది విద్యార్థులు