సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ అలర్ట్‌గా వుంటారు. అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి విషయాన్ని మంత్రి ట్వీటర్ వేదికగా షేర్ చేస్తూ ప్రజలతో పంచుకుంటుంటారు. అయితే నేడు ప్రధాని మోడీపై ట్వీటర్ వార్ చేసారు కేటీఆర్. మోడీజీ సామాన్యులకు పెద్ద గిప్ట్ ఇచ్చారు.. అందరు అందుకోండి. వంట గ్యాస్ సిలిండర్‌పెంచి ప్రతి ఒక్కరికి భారం మోపారు.. (అచ్చెదిన్ ఆగయే బధాయి హో) మంచిరోజులు వచ్చేసాయి శుభాకాంక్షలు అంటూ.. ప్రధాని పై వ్యంగ్యంగా ట్వీటర్ వేదికగా చురకలంటించారు. మంత్రి కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
read also: India Corona: దేశంలో కొత్తగా 16,159 కరోనా కేసులు.. 28 మంది మృతి
నేటితో.. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి పెరిగిన విషయం పెరిగిన విషయం తెలిసిందే. 14.2 కేజీల సిలిండర్ ధరను రూ.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్ లో గ్యాస్ బండ ధర 1055 నుంచి 1105కు చేరింది. ఢిల్లీలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తాజా పెంపుతో రూ.1053కు చేరుకుంది. సాధారణంగా ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ.183.50 మేర తగ్గించాయి. అయితే.. తాజాగా గృహావసరాల గ్యాస్ ధర మాత్రం పెంచడం గమనార్హం. పెంచిన గ్యాస్ సిలిండర్ ధర నేటి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ నెల 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.183.50 మేర తగ్గించాయి. అయితే నెలలో 5 రోజులు గడిచిన తర్వాత గృహావసరాల గ్యాస్ సిలిండర్ ధరను పెంచడం చర్చకు దారి తీస్తోంది.
#AchheDin Aa Gaye 👏 Badhai Ho #LPG over ₹1050 👇 An increase again of ₹50
Modi Ji’s Gift to all Indian Households👍 https://t.co/BknwJ2zNfi
— KTR (@KTRTRS) July 6, 2022