Yashwant Sinha: ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయని ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. భారత్‌లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలంగాణ సీఎం కేసీఆర్ సవివరంగా చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు చెప్పారు. చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని అన్నారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తెరాస సంపూర్ణ మద్దతు ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
BJP V/s TRS: ముచ్చటగా మూడోసారి.. ప్రధానిని ఆహ్వానించేందుకు కేసీఆర్ గైర్హాజరు
Also Read
రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటమో, ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటమో కాదని చెప్పారు. ఇది విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటమని అన్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి మంచివి కాదన్నారు. ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా..? ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా పోరాటం కొనసాగుతుందన్నారు. దేశానికి కేసీఆర్ వంటి నేత అవసరమని ఆయన అన్నారు. ఢిల్లీకి వచ్చే యువనేత కేటీఆర్ తనకు మద్దతు ప్రకటించారని వెల్లడించారు. కేసీఆర్‌తో మరోసారి సమావేశమవుతానని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!