మొయినాబాద్ ఫామ్హౌస్ వేదికగా ఎమ్మెల్యేల కొనుగోలుకు కోసం జరిగిన డీలింగ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్… బీజేపీపై ఛార్జిషీట్ విడుదల చేశారు.. 1. నీతి ఆయోగ్ చెప్పినా ఫ్లోరైడ్ నివారణకు నిధులు ఇవ్వలేదు, 2016లో జేపీ నడ్డా చెప్పిన ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ ఇవ్వలేదు, 2. చేనేతపై జీఎస్టీ వేసిన తొలి ప్రధాని నరేంద్ర మోడీడీ, నూలు సబ్సిడీ తగ్గింపు, ఖాదీ బోర్డ్…
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు యత్నించిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.. మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ స్పందించారు. నంద కుమార్ కి TRS నేతలకు సంబంధాలు ఉన్నాయని ఆయన బీజేపీకి ఎలాంటి సంబందం లేదని తేల్చిచెప్పారు.
మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నాంపల్లి పార్టీకార్యాలయంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. డబ్బు దొరికింది ఫార్మ్ హౌస్ నుండి వచ్చిందా ప్రగతి భవన్ నుండి వచ్చిందా? మునుగోడు ఉప ఎన్నికల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీఆర్ఎస్ పెద్ద కుట్ర చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనిదని స్పష్టం చేశారు. గవర్నర్ గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు.
చేనేత కార్మికుల సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీదృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలంటూ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఒక పోస్ట్ కార్డును కూడా రాశారు కేటీఆర్.. చేనేత కార్మికులకు సంబంధించిన పలు సమస్యలను తన పోస్ట్ కార్డులో ప్రస్తావించిన కేటీఆర్, ప్రధానంగా చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ…