టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. చెప్పుతో కొడతా అని ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానని ఆమె పేర్కొన్నారు. రెండు రోజులుగా జరిగిన ఘటనను పూర్తిగా గవర్నర్ కు వివరించానని తెలిపారు.
పీసీసీ హోదాలో వున్న రేవంత్ రెడ్డి ఇంటి పెద్దమనిషిగా వ్యవహరించాలని, 24 గంటలు సర్వీస్ ఇవ్వాల్సిందే అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నాకు అలవాటని, అసమ్మతి కాంగ్రెస్ లో సహజమని, అన్ని పార్టీలలో అసమ్మతి ఉంటుందని అన్నారు.
ఇండియా మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ హిస్టరీలో సరికొత్త అధ్యాయానికి హైదరాబాద్ వేదిక అయింది. నిన్న మెరుపు వేగంలో దూసుకెళ్తున్న కార్లు.. సరికొత్త సందడితో రేసింగ్ పోటీలు హైదరాబాద్ వాసుల్ని ఉర్రూతలూగించాయి. ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది.
మునుగోడు ఉపఎన్నికలో గెలిచిన TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేడు MLAగా ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ఉదయం అసెంబ్లీలో ఈ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావ్, జగదీష్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
నిజాం కాలేజీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల హాస్టల్ కేటాయింపు సమస్యపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల పక్షాన నిలబడి ఈ విషయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకుని తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.