గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనిదని స్పష్టం చేశారు. గవర్నర్ గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు.
చేనేత కార్మికుల సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీదృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలంటూ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఒక పోస్ట్ కార్డును కూడా రాశారు కేటీఆర్.. చేనేత కార్మికులకు సంబంధించిన పలు సమస్యలను తన పోస్ట్ కార్డులో ప్రస్తావించిన కేటీఆర్, ప్రధానంగా చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ…
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలానూ కాంగ్రెస్ గెలవడం సాధ్యం కాదు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ను గెలిపించాలని అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జేపీ నడ్డ సమాధి కట్టడం ప్రజలు చేశారని, టీఆర్ఎస్ కాదని ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎట్టకేలకు నేడు ఆస్ట్రేలియాకు బయలు దేరనున్నారు. మళ్లీ తిరిగి నవంబర్ 7న హైదరాబాద్ రానున్నారు. అయితే మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు షురూ కావడంతో రాజకీయం మరింతగా వేడెక్కింది.