ఒక్క అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరారు బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ వాడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రక్త, వెంట్రుక నమూనాలిస్తే నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ‘‘నేను తంబాకు తింటానని పచ్చి అబద్దాలు చెప్పినవ్ కదా… నాకు ఆ అలవాటే లేదని నిరూపిస్తా. అందుకోసం రక్త నమూనాలతోసహా నా శరీరంలోని ఏ భాగమైన పరీక్షలకు ఇచ్చేస్తా…. మరి నీకు రక్తపు, రెండు వెంట్రుకల నమూనాలిచ్చే దమ్ముందా?’’అంటూ సవాల్ విసిరారు. ట్విట్టర్ టిల్లు బండారం బయటపడుతుందనే భయంతోనే బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను మూసివేయించారని అన్నారు. తక్షణమే ఆ కేసులు రీ ఓపెన్ చేసి విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలను కోరారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఈరోజు నిర్మల్ జిల్లాలోని మామ్డ మండలం దిమ్మదుర్తి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ సోయం బాపూరావు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, బీసీ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్, గీతామూర్తి, జిల్లా అధ్యక్షురాలు పి.రమాదేవి రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న తదితరులు హాజరయ్యారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కనీసం వారం రోజుల పాటైనా ఉత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు.
Andhra Pradesh: సీపీఎస్ సమావేశాన్ని బహిష్కరించిన ఏడు ఉద్యోగ సంఘాలు
అంబేద్కర్ వర్ధంతి, జయంతిలకు TRS పార్టీ ఒక గంట సమయం కూడా కేటాయించదు. కెసిఆర్ ఇంటి నుంచి బయటికే రాడు. అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. వారం రోజులపాటు బస్తీ బస్తీలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను బిజెపి ప్రభుత్వం వచ్చాక నిర్వహిస్తాం. అంబేద్కర్ చరిత్రను తెలియజేయాల్సిన అవసరం మనపై ఉంది. నేను ఈరోజు ఎంపీ ని అయ్యాను అంటే… అది అంబేద్కర్ పెట్టిన భిక్షనే. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ దేశాన్ని మోడీ పాలిస్తున్నారు. మోడీ ప్రధాని అయ్యాకే పేదోళ్లకు ఈ దేశంలో న్యాయం జరుగుతోందన్నారు. రామ్ నాథ్ కోవింద్ ను భారత రాష్ట్రపతి ని చేసిన ఘనత మోడీదే. పార్లమెంటులో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన పార్టీ బిజెపినే అన్నారు.
అంబేద్కర్ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకే… ‘పంచ తీర్థాల’ పేరుతో అభివృద్ధి చేస్తున్నాం. 12 మంది ఎస్సీ ఎంపీలను, కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత కూడా మోడీదే. ఎంతోమంది ఎస్సి లను గవర్నర్లు, ముఖ్యమంత్రు లుగా చేసిన ఘనత బిజెపి దే అన్నారు. దళితులకు మూడెకరాల పంపిణీ హామీ ఏమైంది? కెసిఆర్ దృష్టిలో.. దళితుడికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి లకు కేసిఆర్ ఎందుకు బయటకు రాడు? కెసిఆర్ తప్ప, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు వెళతారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే కేసీఆర్ మారుస్తానంటున్నాడు… కేసీఆర్ అంత పోటుగాడా? అన్నారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్. పేదల రాజ్యం వస్తేనే… ప్రజా సమస్యలు తీరుతాయి. ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి అన్నారు.
దళిత బంధు, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మాత్రం పైసలు లేవు… దండుకోడానికి మాత్రం పైసలు ఉన్నాయి. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల దిబ్బగా మార్చండి. పుట్టబోయే ప్రతి బిడ్డపై లక్ష రూపాయలు అప్పు పెట్టిండు. కేసీఆర్ బిడ్డ కవిత ఢిల్లీ పోయి లక్ష కోట్ల లిక్కర్ దందా చేసింది. మునుగోడులో దొంగ ఓట్లు రాయించుకుని టిఆర్ఎస్ గెలిచింది. అది గెలుపే కాదు. మునుగోడులో నైతిక గెలుపు, నిజమైన గెలుపు బిజెపి దే అన్నారు బండి సంజయ్. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బిజెపి మద్దతు ఇచ్చినందుకే.. ఈ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
Karnataka – Maharashtra Border: కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉద్రిక్తత.. రెచ్చిపోయిన ఆందోళనకారులు