Minister KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ అకౌంట్ కు ఒక విచిత్రమైన కంప్లైంట్ వచ్చింది. చెరువు మాయమైందంటూ ఫ్యూచర్ ఫౌండేషన్స్ సొసైటీ ప్రతినిధులు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో చేసిన ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీలోని లోధా అపార్టుమెంట్ వద్ద ఆర్నెళ్ల క్రితం కనిపించిన చెరువు ప్రస్తుతం కనిపించడం లేదంటూ కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ చెరువు అదేందో చూడమని.. కనిపించకపోవడం నిజమే కాబట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే కలెక్టర్, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్లకు చెరువును సందర్శించి త్వరగా ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు.
Read Also: Jd Lakshminarayana on Mlc Kavitha Case: కవిత కేసులో ఏం జరుగుతుందంటే?
కేటీఆర్ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు లోధా అపార్టుమెంట్ ప్రాంతంలో చెరువు కోసం వెతకడం ప్రారంభించారు. ఎంత వెతికినా ఫలితం లభించలేదు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫోటోలను పరీక్షించి చూస్తే ఆర్‌టీఓ ఆఫీసు సమీపంలో ఉన్న సెల్లార్ గుంతలా అనిపించింది. మూసాపేట సర్కిల్ ఉపకమిషనర్ రవికుమార్ ఇతర అధికారులు అక్కడికి వెళ్లి చూసి అవాక్కయ్యారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర గృహ నిర్మాణ మండలి ఆధ్వర్యంలో బహుళ అంతస్థుల భవనం నిర్మించి విక్రయించేందుకు చేపట్టిన నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వి పూడ్చిన సెల్లార్ గుంత కావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పదేళ్ల క్రితం తవ్విన సెల్లార్ గుంతలో వర్షం కారణంగా నీళ్లు నిండి చెరువులా మారింది. సెల్లార్ గుంతలో గతేడాది ముగ్గురు బాలికలు ఆడుకుంటూ వెళ్లి సెల్లార్ గుంతలో పడి చనిపోయారు. ఈ ఘటనలో స్పందించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సెల్లార్ గుంతను పూడ్చి వేయించారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షలు, ఎమ్మెల్యే సొంతంగా రూ.3లక్షలు పరిహారం కూడా ఇచ్చారు.
If this👇is true, I assure you that stringent action will be taken on those who are responsible @CollectorRRD and @zckukatpally please inspect and submit a report to the Govt at the earliest@KTRoffice please follow up https://t.co/2LPyfdBgun
— KTR (@KTRTRS) December 4, 2022
If this👇is true, I assure you that stringent action will be taken on those who are responsible @CollectorRRD and @zckukatpally please inspect and submit a report to the Govt at the earliest@KTRoffice please follow up https://t.co/2LPyfdBgun
— KTR (@KTRTRS) December 4, 2022