మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలానూ కాంగ్రెస్ గెలవడం సాధ్యం కాదు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ను గెలిపించాలని అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జేపీ నడ్డ సమాధి కట్టడం ప్రజలు చేశారని, టీఆర్ఎస్ కాదని ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎట్టకేలకు నేడు ఆస్ట్రేలియాకు బయలు దేరనున్నారు. మళ్లీ తిరిగి నవంబర్ 7న హైదరాబాద్ రానున్నారు. అయితే మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు షురూ కావడంతో రాజకీయం మరింతగా వేడెక్కింది.
మునుగోడు ఉప ఎన్నిక ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరని BJP పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికతో TRS నాయకులు, శ్రేణులు కుంగిపోతున్నాయని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది… అయితే, ఈ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ప్రకటించాయి… కమ్యూనిస్టులకు చెప్పుకోదగిన ఓటింగ్ ఉండడంతో.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వారితో పొత్తుకోసం ప్రయత్నాలు చేశాయి.. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఓడించాలంటే.. టీఆర్ఎస్కే సాధ్యం.. అందుకే.. తమ మద్దతు.. గులాబీ పార్టీకేనని ప్రకటించాయి సీపీఎం, సీపీఐ.. అయితే, మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక విషయంలో చేసిన కామెంట్లను…
ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో.. నేడు రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏల నిరసన చేపట్టారు.