తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, ఈడీ విచారణ, రాబోయే ఎన్నికలు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న పరిస్థితులపై మంత్రి గంగుల కమలాకర్ తనదైన రీతిలో స్పందించారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈడీ, సీబీఐ దాడులపై ఆయన మాట్లాడారు. తమ కుటుంబం నలభై యాభై ఏళ్ళ నుంచి కాంట్రాక్టులు చేసుకుంటున్నాం అన్నారు. చట్టానికి మేం సహకరించామన్నారు. గ్రానైట్ అసోసియేషన్ స్పందిస్తుంది. మేం దాచేది లేదు. చెక్ పోస్టులు వుంటాయి. బీజేపీ నేతలకే ఎక్కువ గ్రానైట్ కంపెనీలు వున్నాయన్నారు. గ్రానైట్ లో అనేక పార్టీలు వున్నాయన్నారు.
Read Also: Boora Narsaiah Goud: కేసీఆర్ ఒక మంచి స్క్రిప్ట్ రైటర్.. ఆ తప్పులన్నీ కేంద్రంపై నెట్టారు
గ్రానైట్ మాఫియా విషయంలో మాపై ఆరోపణలు వచ్చాయన్నారు. పెట్టుబడులపై ఈడీ, ఐటీ దాడుల ప్రభావం వుంటుందన్నారు. కాపు సమావేశంలో నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారం వివాదాస్పదం అయింది. అధికారులు నన్ను గంటల కొద్దీ విచారించారన్నారు. నేను తప్పుచేయలేదు కాబట్టి భయపడలేదు. నకిలీ ఐపీఎస్ అధికారి అంటూ కులసంఘాన్ని మోసం చేశాడని బాధకలిగిందన్నారు. 1991 నుంచి గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాం. రాజకీయ కుట్రల్లో భాగంగా మాపై ఫిర్యాదులు చేశారు. బీజేపీ నేతల ప్రమేయం ఉందన్నారు. దుబాయిలో ఉండగా ఈడీ రైడ్ జరిగినప్పుడు మా ఇంటి తలుపులు పగులగొట్టారు. నేనే వీడియో కాల్ చేసి లాకర్ పాస్ వర్డ్ చెప్పానన్నారు. నేను చట్టానికి సహకరించానన్నారు. లాకర్ లో కొంచెం డబ్బులు, 10 తులాల బంగారం వుందని పంచనామా చేశారన్నారు మంత్రి గంగుల కమలాకర్. గ్రానైట్ వల్ల 50 వేలమందికి ఉపాధి కలుగుతోంది. మేం మాఫియాకు పాల్పడలేదన్నారు. స్కాం చేసి మాఫియాగా చిత్రీకరిస్తే ప్రభుత్వం ఊరుకోదన్నారు. ఎన్ని డాక్యుమెంట్లు ఇవ్వమన్నా ఇస్తాం అన్నారు.
మా కంపెనీల్లో ఒక్కరూపాయి హవాలా చేయలేదు. గెట్ టుగెదర్ మీటింగ్ ని పెద్దగా చూస్తున్నారు. మేం తప్పుచేయలేదు. మల్లారెడ్డిపై నాపై దాడులు రాజకీయకుట్రల్లో భాగం అని నేను భావిస్తున్నాను. టీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేశారు. విదేశీ మారకద్రవ్యం రావాలని మోడీ చెప్పారు. ఇలా దాడులు చేస్తే ఇండస్ట్రీ దెబ్బతింటుందన్నారు మంత్రి గంగుల కమలాకర్.షర్మిల బీజేపీ సంధించిన బాణం అని ఆరోపించారు మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ కోసం మేం పోరాటం చేశాం. మేం గుజరాత్ వెళ్ళి పోటీచేయలేం. టీఆర్ఎస్ ని బలహీనం చేయడం కోసమే షర్మిల పనిచేస్తున్నారు. నిజానికి పార్టీ పెట్టాల్సింది అనిల్ కుమార్. తెలంగాణపై దాడి చేయడాన్ని గమనిస్తే షర్మిల వెనుక బీజేపీ వుందన్నారు. మేం చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్నాం. చట్టవ్యతిరేకంగా చేస్తే దర్యాప్తు చేయండి. అవకతవకలు వుంటే శిక్షిస్తాయి. మేం దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నాం. మేం ఎక్కడికీ పారిపోవడం లేదన్నారు.
ఎన్నికల వరకూ ఇలాంటి పరిస్థితులు వుంటాయి. ఏం జరుగుతుందో, ఏం జరగబోతోందో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ నేతలు తమ నిజాయితీని నిరూపించుకోవాలి. నోటీసులు ఇచ్చినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు. విచారణలో బయటపడుతుంది. తప్పులేకుంటే ఎవరినీ శిక్షించలేం. మాకు చట్టాల మీద నమ్మకం ఉంది. తెలంగాణలో వలసలు వస్తున్నాయి. దాడుల వల్ల బాధ కలుగుతోంది. ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలి. అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ కి వస్తున్నాయి. షర్మిల తన అన్న కోసమే పనిచేసింది. జగనన్న కోసమే ఆమె పనిచేయాలి.
ముంపు మండలాలను మళ్ళీ కలపాలి. అందుకోసం ధర్నా చేయాలి. తెలంగాణ బిడ్డగా గౌరవించాలంటే అది చేయాలి. షర్మిల అరెస్ట్ వ్యవహారం వెనక బీజేపీ వుంది. ఆమెకు బీజేపీ సపోర్ట్ వుంది. మాకు పోటీ కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా మాలో కలిశారు. ముందస్తు ఎన్నికలు రావు. వివిధ పథకాలను చేయాలి. సిట్టింగ్ లకే మళ్ళీ టికెట్లు ఇస్తామన్నారు కేసీఆర్. టీఆర్ఎస్ కారు గుర్తుకి వెళతాం. కేసీఆర్ కి ఓటేస్తారు. 119 అభ్యర్థుల ద్వారా కేసీఆర్ బొమ్మకు ఓటేస్తారు. సిట్టింగ్ లకు సీట్లిస్తారు. ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూడాలి. షర్మిల కూడా సీఎం కావాలని భావిస్తోంది. కేసీఆర్ లేని తెలంగాణ చూడలేం. కేసీఆర్ లేకుంటే పథకాలు రావు, హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే కేసీఆర్ కి మళ్లీ అవకాశం ఇవ్వాలి. రాష్ట్రం గురించి ఆలోచించేది కేసీఆర్. నేను తప్పుచేయలేదు. ఈడీ, ఐటీ, సీబీఐ నన్ను ఏం చేయలేవన్నారు మంత్రి కమలాకర్.
Airbus Beluga : హైదరాబాద్లో ల్యాండైన ఎయిర్ బస్ బెలూగా