కృష్ణానది యాజమాన్య బోర్డు కమిటీ.. రేపటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పరిశీలన వాయిదా పడింది… నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు బుధవారం రోజు కేఆర్ఎంబీ కమిటీ రాయలసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించాల్సి ఉంది.. అయితే, మంగళవారం సాయంత్రం వరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో… పరిశీలన వాయిదా వేశారు.. ఇక, జూలై 3వ తేదీన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్తామని కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం ఇచ్చింది కేఆర్ఎంబీ.. జూలై 3న రెండు ప్లాటూన్ల సీఐఎస్ఎఫ్ బలగాలతో ఏపీలోని రాయలసీమ ప్రాజెక్టుల పనులను పరిశీలించనుంది.. కాగా, ఇప్పటికే రాయలసీమ ప్రాజెక్టు పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇదే విషయంపై మొన్న సీఎం కేసీఆర్ జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రాజెక్ట్‌లతో తెలంగాణ నష్టపోతుందని వివరించారు. దీనిపై స్పందించిన జలశక్తి మంత్రి కేఆర్ఎంబీని ఆదేశించారు. ఈ పనులను పరిశీలించాలని సూచించారు. అవసరమైతే కేంద్ర బలగాల సాయంతో వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించిన విషయం తెలిసిందే.