రాయలసీమ ఎత్తిపోతల పథకం క్షేత్ర స్థాయి పర్యటనను రద్దు చేసుకోవాలని కేఆర్ఎంబీకి ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామలరావు లేఖ రాసారు. రాయలసీమ లిఫ్ట్ సీఈ, ఎస్ఈలు కరోనా బారిన పడ్డారని లేఖలో స్పష్టం చేసిన ఇరిగేషన్ సెక్రటరీ… కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని పేర్కొన్నారు శ్యామలరావు. ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమ లిఫ్ట్ క్షేత్ర స్థాయి పర్యటన సాధ్యం కాదని కేఆర్ఎంబీకి తెలిపారు. సోమ, మంగళవారాల్లో రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించాలనుకున్న కేఆర్ఎంబీకి ఇంకా పరిధిని కూడా ఇంకా నిర్ధారించ లేదని లేఖలో ప్రస్తావించారు శ్యామలరావు. పర్యవేక్షక బృందంలోని కొందరి సభ్యులపై తమకు అభ్యంతరాలున్నాయని లేఖలో స్పష్టం చేసారు ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ. కేఆర్ఎంబీ బోర్డు మీటింగులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చేపడుతోన్న ప్రాజెక్టుల పరిశీలనపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని లేఖలో స్పష్టం చేసింది ఏపీ.