కేఆర్‌ఎంబీకీ ఆంధ్ర ప్రదేశ్ జలవనరులశాఖ మరోసారి లేఖ రాసింది. కృష్ణా బేసిన్ లోని రిజర్వాయర్ లలో నీటి మట్టం పెరుగుతోందని తెలిపింది. పరివాహక ప్రాంతంలో వర్షాలు పడటంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ కు భారీగా వరద వస్తోందని తెలిపింది. శ్రీశైలం లో నీటి మట్టం 870 అడుగులకు చేరిందని లేఖలో వెల్లడించింది. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో జలవిద్యుత్ ఉత్పాదనకు అనుమతివ్వాలని కోరింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నీటి మట్టం పెరిగితే జల విద్యుత్ ఉత్పాదన చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సూచించింది. దాని ప్రకారం అనుమతివ్వాలని ఏపీ జలవనరుల శాఖ లేఖ ద్వాదా విన్నవించింది.