KRMB: నేడు కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ కీలక భేటీ.. తాగునీటి కేటాయింపులపై చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KRMB: నేడు ఎర్రమంజిల్ జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. వేసవి కాలంలో తాగు నీటి కోసం నీటి కేటాయింపు అంశాలపై ఇరు రాష్ట్రాలు చర్చించనున్నాయి. ఇప్పటికే కేటాయిస్తున్న నీటితో పాటు వినియోగం, నీటి లభ్యతతో పాటు మిగులు జలాల కేటాయింపులపై ఏపీ, తెలంగాణ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. కేఆర్‌ఎంబీ బోర్డు మెంబర్ సెక్రటరీ రాయిపురే, సభ్యులు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణ రెడ్డి సభ్యులుగా ఉన్న ఈ త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలశయాల్లో తాగునీటి అవసరాలకు గాను ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలను బోర్డు కేటాయించగా వాటి ఉపయోగంపై కీలక చర్చ జరగనుంది.
Read Also: Pawan Kalyan: నేడు తిరుపతికి పవన్ కల్యాణ్.. అసంతృప్త నేతలతో భేటీ
Also Read
త్రిసభ్య కమిటీ గత అక్టోబర్‌లోనే సమావేశమై రెండు రిజర్వాయర్లలో దాదాపు 82కి పైగా టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించింది. అందులో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలను కేటాయించింది. మిగిలిన 2 టీఎంసీలను మే నెల తర్వాత భవిష్యత్ అవసరాలకు వినియోగించాలని తెలిపింది. అయితే, తెలంగాణ ఇప్పటికే కోటాకు మించి నీటిని వాడుకుంది. కాగా, ఏపీ తన కోటాలో 42 టీఎంసీలను వినియోగించుకోగా, మరో 3 టీఎంసీలు మిగిలి ఉన్నాయి. తాజాగా ఏప్రిల్‌లో మరో 5 టీఎంసీలను విడుదల చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ గతంలో కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. ఈ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?