KRMB: ఏపీకి మూడు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి ఇచ్చింది. నాగార్జున సాగర్ కుడి కాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా రేపు నీరు విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. కేఆర్ఎంబీ అధికారుల సమక్షంలో నీటిని విడుదల చేయనున్నారు. నీటి విడుదల కోసం ఇప్పటికే కేఆర్‌ఎంబీ ఉత్తర్వులు జారీ చేసింది.