తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల విషయంలో వ్యవహారాలను చక్కబెట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. బోర్డు ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలోకి కేఆర్ఎంబీ వెళ్లిపోయింది.
కృష్ణాజలాల గురించి చాలా కాలంగా సమస్యలు ఉన్నాయి. నీటి వినియోగానికి సంబంధించి వాస్తవంగా దక్కాల్సిన వాటా తమకు దక్కడం లేదని తెలంగాణ రాష్ట్రం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాదికి సంబంధించి కృష్నా జలాల వాడకం పై కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ముందు పలు డిమాండ్‌లను ఉంచింది.
Palamuru Rangareddy Lift Irrigation Project: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటూనే ఉన్నారు.. ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ ఈఎన్సీ… పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వాలని లేఖలో కేఆర్ఎంబీని కోరింది… విభజన చట్టానికి వ్యతిరేకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానం జరుగుతోందని ఆక్షేపించింది.. కృష్ణా బేసిన్‌లో తెలంగాణ…
రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను ఇంతవరకూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించలేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు. గత సంవత్సరం 2021 జులై 15న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కేఆర్‌ఎంబీ జ్యూరిస్‌డిక్షన్ నోటిఫికేషన్ ప్రకారం అందులో పేర్కొన్న షెడ్యూల్-2లోని సాగునీటి ప్రాజెక్టులను ఏపీ, తెలంగాణలు తప్పనిసరిగా బోర్డుకు అప్పగించాలని తెలిపిన రెండు రాష్ట్రాలు ఇప్పటి వరకూ ఆ ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ, యాజమాన్య బాధ్యతలేమీ అప్పగించలేదని…
అనుమతులు లేకుండా ప్రాజెక్టుల పనుల తక్షణమే నిలిపివేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (Krishna River Management Board) తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈనేపథ్యంలో.. కేంద్రం గతంలో ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ గడువు పూర్తయిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు లేఖ రాసిన బోర్డు, ఈ విషయాన్ని పేర్కొంది. దీంతో.. ప్రాజెక్టుల అనుమతులకు కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన గడువు ఈనెల బుధవారం 13తో ముగిసింది. కాగా.. పనులు నిలిపి వేయాలని స్పష్టం చేస్తూ బోర్డు ఆంధ్రా,…
హైదరాబాద్ జలసౌధలో గురువారం సాయంత్రం కేఆర్‌ఎంబీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కృష్ణా నది పరివాహక ప్రాంత రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనులను గెజిట్ నోటిఫికేషన్‌లో రెండుగా చూపడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదీ ఆయకట్టును 3 నుంచి 4 లక్షల ఎకరాలకు పెంచారని, కానీ నీటి కేటాయింపులు పెంచలేదని…
కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండు కాంపోనెంట్లుగా (1.14 మరియు 1.15) గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరిచారు. అవి రెండూ ఒకే కాంపోనెంట్ గా పొందుపర్చాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే KRMB కి లేఖ రాసింది. గెజిట్ నోటిఫికేషన్ లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండవ కాంపోనెంట్ ను 25 టిఎంసీల నుండి 40 టిఎంసిల వరకు పెంచినదిగా చూపించారు. అది తప్పు అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.…
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపును కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఖరారు చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద ఈనెల 15 వరకు 112.5 టీఎంసీల నీటి వినియోగానికి బోర్డు ఆమోదం తెలిపింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు రెండు ప్రాజెక్టుల కింద ఏపీ, తెలంగాణ కలిపి 294.33 టీఎంసీల నీటిని వాడుకున్నాయి. బోర్డు తాజా నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా మరో 407 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం దక్కించుకున్నాయి. Read…
కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ వర్చువల్‌గా సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి వర్చువల్‌గా పాలర్గొన్నారు. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ర్టాల తాగు, సాగు అవసరాలకు సంబంధించిన నీటి విడుదల గురించి చర్చించారు. నీటి కేటాయింపులపై సరైన నిర్ణయం తీసుకోవాలని మురళీధర్ బోర్డునుకోరారు. గెజిట్ అమలు పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను ఆయన వివరించారు. కాగా ఇప్పటికే నీటి కేటాయింపులపై పలుమార్లు…