కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందం పర్యటించింది. చోడవరంలో దెబ్బతిన్న బొప్పాయి, అరటి, కంద పంటలను కేంద్ర బృందం పరిశీలించింది.
కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం మహీంద్రా థార్ కారులో వెళ్తూ గన్నవరం - కేశరపల్లి రూట్‌లో కారుతో సహా గల్లంతైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణి.. సోమవారం బుడమేరులో శవమై తేలాడు.
కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి బుడమేరు వద్ద యువకుడి ప్రాణాలను ఓ పోలీసు అధికారి కాపాడారు. ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు వరద నుంచి యువకుడిని గన్నవరం సీఐ శివప్రసాద్ రక్షించారు.
జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తే ఆమెపాలిట కాలయముడై భార్యను అతి కిరాతకంగా చంపాడు. భార్యను చంపడమే కాకుండా ఎవరికీ అనుమానం రాకుండా రైల్వే ట్రాక్‌పై పడేశాడు ఆ దుర్మార్గపు భర్త. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని దూళ్లవానిగూడెంలో చోటుచేసుకుంది.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం హంసలదీవి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. గుడివాడకు చెందిన ఐదుగురు సముద్రంలో కొట్టుకుపోతుండగా.. ముగ్గురిని తోటి పర్యాటకులు, మెరైన్ పోలీసులు కాపాడారు. ఇద్దరు సముద్రంలో గల్లంతు కాగా.. ఒకరి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది.
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప మున్సిపాలిటీలోని ఎం.కన్వెన్షన్ నందు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కాగా.. ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనసభ్యులు, పలువురు ప్రముఖులు వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ఆవిష్కరించిన పుస్తకాలను అతిధులకు అందజేశారు.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కి వరద ప్రవాహం రోజురోజుకూ పెరిగిపోతుంది. పులిచింతల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్, పులిచింతల మధ్య క్యాచ్‌మెంట్ ఏరియాలో కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వస్తుంది.
కృష్ణా జిల్లాలోని గన్నవరం పరిధిలోని బాపులపాడు హైవేపై పైవేట్ ట్రావెల్స్ బస్సు నిలిచిపోవడంతో ప్రయాణీకులు నానా అగచాట్లు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి హైవే పైనే బస్సు నిలిచిపోయింది. అయితే, బస్సులో దాదాపు 36 మంది ప్రయాణికులు ఉన్నారు.