ఏపీలో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో వీరమ్మతల్లి సిడిబండి మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. పారుపూడి కనక చింతయ్య సమేత శ్రీ వీరమ్మ తల్లి పేరంటాల మహోత్సవ వేడుకలు గత 11 రోజులుగా ఉయ్యూరు పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. బ్యాంక్ మేనేజర్ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కృష్ణా జిల్లాలోని గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. 500 రూపాయల కోసం భార్యాభర్తల మధ్య వివాదం జరిగినట్లు తెలిసింది.
ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందాల కోలాహలం కొనసాగుతోంది. బరుల్లో కోడిపుంజులు పందానికి కాలు దువ్వుతున్నాయి.
తన కూతురు పడొద్దని ఆ యువకుడికి ఆ తండ్రి ఎన్నిసార్లు చెప్పాడో.. చివరకు ఆవేశం ఆగక కడతేర్చాలని చూశాడు. పద్ధతి గల కుటుంబం కావున తన కూతురు వెంట ఓ యువకుడు పడుతున్నాడని నలుగురికి తెలిస్తే పరువు పోతుందనుకున్న తండ్రి.. చివరకు చంపేందుకు సిద్ధమయ్యాడు. సినిమాటిక్ టైప్ లో తన కొడుకుతో కలిసి తన కూతురు వెంటపడుతున్న యువకుడిపై దాడి చేశారు.
కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలంలో నూతన సంవత్సర వేడుకల్లో ఓ వాలంటీర్ దాష్టీకం ప్రదర్శించాడు. మండలంలోని పెదప్రోలు గ్రామస్తులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుండగా.. అక్కడ వాలంటీర్ సుధాకర్ రెచ్చిపోయాడు. డీజే వివాదంలో గ్రామస్తులపై దాడికి పాల్పడ్డాడు.. మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసినట్టు మండిపడుతున్నారు స్థానికులు..
కృష్ణా జిల్లాలోని గుడివాడలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి పాశవికంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. మహిళను దారుణంగా హత్య చేసిన ఈ ఘటన గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో జరిగింది.
కృష్ణాజిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తోట్లవల్లూరు మండలంలోని పాములలంకలో విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు మృతి చెందారు. పాములలంకకు చెందిన పాముల విజయాంభ, పాముల చిరింజీవిగా గుర్తించారు.