కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప మున్సిపాలిటీలోని ఎం.కన్వెన్షన్ నందు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కాగా.. ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనసభ్యులు, పలువురు ప్రముఖులు వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ఆవిష్కరించిన పుస్తకాలను అతిధులకు అందజేశారు.
Read Also: Paris Olympics 2024: ఈఫిల్ టవర్ ఎక్కిన ఓ వ్యక్తి.. అలర్ట్ అయిన పోలీసులు
అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లో మొదటిసారి పోటీ చేసినప్పుడు ఒక్క రూపాయ కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ప్రజలే తనకు ఎదురు డబ్బులు ఇచ్చిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. రెండవ సారి పోటీ చేసినప్పుడు తాను, జైపాల్ రెడ్డి గెలవాలి అని కోరుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు అని పేర్కొన్నారు. మొదటి ప్రాధాన్యం మాతృభాష, ఆ తరువాత మరి ఏ భాష అయినా అని తెలిపారు. కనుక అందరూ ముందు మాతృభాష మాట్లాడాలని చెప్పారు. మాతృభాష కంటి చూపులాంటిది.. పరాయి భాష రేబాన్ కళ్ళజోడు లాంటిదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
Read Also: Silent Mode Phone: సైలెంట్ మోడ్‌లో ఉన్న ఫోన్ కనపడట్లేదా.? నిమిషాల్లో ఇలా కనిపెట్టండి..
మరోవైపు.. విద్యా విధానంలో మార్పులు రావాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రభుత్వం నుండి కానీ, రాజకీయ నాయకుల దగ్గర నుండి ఒక రూపాయి ఆశించకుండా.. తన మిత్రుల సహకారంతో స్వర్ణ భారత్ ట్రస్ట్ నడుస్తుందని తెలిపారు. ప్రజా సిద్ధాంతం, విలువలు, సంప్రదాయం.. ప్రతి రాజకీయ నాయకులు నేర్చుకోవాలని చెప్పారు. రాజకీయ జీవితంలో నాయకుడు, నాయకులు విమర్శించుకోవాలి కానీ.. కుటుంబ సభ్యులను ఏ ఒక్క రాజకీయ నాయకుడు విమర్శించకూడదని అన్నారు. అలా విమర్శించారు కాబట్టే గత ప్రభుత్వానికి ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పారని వెంకయ్యనాయుడు తెలిపారు.