Flights Diversion : కృష్ణా జిల్లాను పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport) వద్ద కూడా భారీగా పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. పొగమంచు కారణంగా క్లియరెన్స్ లేక గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద పలు విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి. పొగమంచు కారణంగా సుమారు గంట నుంచి ఫ్లైట్స్ గాల్లోనే చక్కర్లు కొడుతున్న పరిస్థితి. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల…
కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ స్వామివారు, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ షష్టి మహోత్సవాలను ప్రారంభించారు.
కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష.. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు జగన్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. రాష్ట్రంలో రెడ్ బుడ్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు.
రైతులకు అండగా ఉంటాం.. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పిస్తాం.. కానీ, రైతులు దళారులను ప్రోత్సహించొద్దు అని సూచించారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. కృష్ణా జిల్లాలో పర్యటించిన ఆయన.. పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యపురాసులను పరిశీలించారు.. రైతులతో మాట్లాడుతూ.. ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతుందంటూ భరోసా ఇచ్చారు..
కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలువలోకి స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన బాపులపాడు మండలం ఏ. సీతారాంపురం గ్రామంలో జరిగింది. ఏలూరు కాల్వలోకి స్నానం చేయడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు చనిపోయారు.
దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దుర్మార్గులు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మాదాలవారి గూడెంలో విషాదం చోటు చేసుకుంది. లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు పక్కనే ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లి గల్లంతు అయ్యారు. మొత్తం ఏడుగురు బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు చెరువులోకి సరదాగా స్నానానికి వెళ్లారు. సెల్ఫీల మోజులో పడి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో పాలడుగు దుర్గారావు, జే. వెంకటేష్ గా గుర్తించారు. మరో ఐదుగురు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.
Water Samples: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని 44 గ్రామాల్లో గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు నీటి శాంపిల్స్ సేకరిస్తున్నారు.
Tiruvuru: తిరువూరు టీడీపీలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు తీరుతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యేకు చెక్ పెట్టే విధంగా అధిష్ఠానం నిర్ణయం ఉంటుందంటున్న పార్టీ వర్గాలు.. గడిచిన 100 రోజుల్లోనే పార్టీకి తలనొప్పిగా ఎమ్మెల్యే వ్యవహార శైలి మారింది.
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో చిట్టీల వ్యాపారంతో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. పెడన మండలం పెనుమల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగిత శివకుమార్ అనే వ్యక్తి గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.