అసభ్య ప్రవర్తన కలిగిన హోంగార్డును కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విధుల నుంచి తప్పించారు. హోంగార్డు 304 బీ.అజయ్ కుమార్ అసభ్య నృత్యాలు చేస్తూ అనుచిత ప్రవర్తన కలిగి పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంతో.. సదరు హోంగార్డుపై క్రమశిక్షణ చర్యలకు జిల్లా ఎస్పీ ఉపక్రమించారు. ప్రజారక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో పాల్గొనవలసిన హోంగార్డ్ అసభ్య నృత్యాలు చేస్తూ ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా విస్తృతంగా వ్యాపించడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వాటిపై…
Off The Record: తర్క వితర్కాలు, పెద్ద పెద్ద చర్చోపచర్చలతో నిమిత్తం లేకుండానే…. ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో పాటు వివిధ వర్గాల్లో ఒక స్థిరమైన అభిప్రాయమైతే ఉంది. అదే… వైసీపీలో కమ్మ కులానికి అంత ప్రాధాన్యం ఉండదని. అలాగే ఆ సామాజికవర్గంలో ఎక్కువ మంది అదే విషయాన్ని నమ్ముతారు కూడా. వాళ్ళతో మాకెలాంటి విభేదాలు లేవని వైసీపీ అధిష్టానం ఒకటికి పదిసార్లు చెప్పినా… అనుమానాలు మాత్రం తొలిగిపోలేదన్నది నిష్టుర సత్యం. అలా ఖచ్చితంగా ఆ సామాజికవర్గానికి, పార్టీకి…
మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, పంటనష్టం చోటుచేసుకున్నప్పటికీ, ముందస్తు చర్యల వల్ల నష్టం చాలా వరకు తగ్గించగలిగామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో తీవ్రంగా నష్టపోయిన కృష్ణా జిల్లాల్లో ఈరోజు (అక్టోబర్ 30న) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు.
Nara Lokesh: మొంథా తుఫానుపై ఆర్టీజీఎస్ కేంద్రంలో రెండో రోజు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు.. వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు.. మొంథా తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై అధికారులను ఆరా తీశారు మంత్రి నారా లోకేష్..
కృష్ణా జిల్లా తాళ్లపాలెంలో రాజకీయ ప్రత్యర్థుల చేతిలో దాడికి గురైన వైసీపీ కార్యకర్తలు గిరిధర్ (ఆర్ఎంపీ డాక్టర్), సతీష్ను ఫోన్లో పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో ఫోన్లో మాట్లాడిన ఆయన, ఘటన వివరాలు ఆరా తీశారు.
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు వేగవంతమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోపే ప్రభుత్వానికి నివేదికని ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకొనుంది. అయితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రెండు మూడు జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని చోట్ల హద్దులు మార్చే అవకాశం ఉందని సమాచారం. వైస్సార్సీపీ హాయాంలో పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అయితే, ఇందులోని గందరగోళం ఉందని మార్పులు అవసరమని…
ఉమ్మడి కృష్ణాజిల్లాలో భారీ వర్షాల ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతోంది. జగ్గయ్యపేటలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలలో వరి, పత్తి, పొలాలు నీట మునిగాయి. కూచి వాగు వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో పెనుగంచిప్రోలు నుండి తెలంగాణ మధిరకు రాకపోకలు నిలిచాయి.