కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదంతో వేకువ ఝామున రహదారి నెత్తురోడింది. ఇవాళ (శుక్రవారం) ఉదయం కృత్తివెన్ను మండలం సీతనపల్లి దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వ హస్పటల్ కు తరలించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరోసారి పాత సెంటిమెంట్ రిపీట్ అయ్యింది.. ఓ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన వారు.. తర్వాత ఎన్నికల్లో ఓటమి చెందుతారనే సెంటిమెంట్ కృష్ణా జిల్లాల్లో మరో సారి రిపీట్ అయ్యింది.. దానికి వైఎస్ జగన్ కేబినెట్‌లో జిల్లా నుంచి మంత్రులుగా పని చేసిన అందరూ పరాజయం చవిచూశారు..
కృష్ణా జిల్లాలో పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మచిలీపట్నం పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు.
వారసుడు కావాలి అని అత్తింటి వారు వేధింపులు తాళలేక గర్భిణీ మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పెనమలూరు మండలం రామలింగేశ్వర నగర్‌కు చెందిన చందు కావ్య శ్రీ (19) ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా.. కొన ఊపిరితో ఉన్న కావ్యశ్రీని కామినేని హాస్పిటల్‌కు భర్త, తల్లిదండ్రులు తరలించగా చికిత్స పొందుతూ కావ్యశ్రీ మృతి చెందింది.
వ్యవసాయ శాఖ అధికారులు తమ చేతివాటం చూయించారు. రైతుల ఖాతాల్లో జమకావాల్సిన పంట నష్టం సొమ్మును దారిమళ్లించారు. నకిలీ ఖాతాల్లో జమ చేసుకుని కాజేశారు. ఈ విషయం కాస్త రైతులకు తెలియడంతో ఆందోళనకు దిగారు. ఈ ఉదాంతం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన ప్రదేశంలోనే నలుగురు దుర్మరణం చెందారు. మరో వ్యక్తి తీవ్రగాయాలు అయ్యాయి.
నమ్మించి మోసం చేసింది ఓ మాయలేడి. కృష్ణా జిల్లా గుడివాడలో అమాయకులకు మాయమాటలు చెప్పి కోటిన్నర కాజేసింది మాయలేడి. గుడివాడలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. మాయ లేడి లీలావతిపై చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలంటూ రూరల్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.