పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. పామర్రు పోలీస్ స్టేషన్ కు ఇప్పటికే జిల్లా ఎస్పీ గంగాధర్ చేరుకున్నారు. మచిలీపట్నం లేదా పామర్రు పోలీస్ స్టేషన్ లో పేర్ని నానిపై కేసు నమోదు చేయనున్నారు.
తూర్పు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ వరకూ ద్రోణి వ్యాపించింది. కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణ జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల…
Illicit Affair: వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని తలకిందులు చేసింది. వివాహేతర సంబంధమే కారణంగా మహిళా, ఆమె కుమారుడు హత్యకు గురయ్యారు. ఈ విషాదకర ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుని సంచలనం రేపుతోంది. ఈ హత్యలు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, మెదక్‌లలో జరిగాయి. కేసును విచారిస్తున్న కృష్ణా జిల్లా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ హత్యలకు సంబంధించిన పుర్తి వివరాలలోకి వెళితే.. పోచమ్మ అనే మహిళ మామిడి గోపాల్ అనే వ్యక్తితో కలిసి జీవనం…
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.. ఇంటర్ ఫస్టియర్‌లో 70 శాతం ఉత్తీర్ణత.. సెకండియర్‌లో 83 శాతం ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులు.. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉంది అన్నారు మంత్రి నారా లోకేష్.
కృష్ణా జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అదుపులోనికి తీసుకున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో విచ్చలవిడిగా క్రికెట్ ఆన్లైన్ బెట్టింగులు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నియోజకవర్గ పరిధిలో ఉంగుటూరు మండలంలో 10మందిని, గన్నవరం మండలంలో 10మందిని, బాపులపాడు మండలంలో మరికొందరు క్రికెట్ భూకీలను అదుపులోకి తీసుకున్నారు. నియోజకవర్గ పరిధిలో యువత వ్యసనాలకు బానిసలై బెట్టింగులకు పాల్పడుతున్నారు.
ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు అరవై కేజీల గంజాయి, ఎర్టిగా మారుతి కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ఆర్ గంగాధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అందిన సమాచారం మేరకు పొట్టిపాడు టోల్ గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఈనెల 20వ తారీఖున…
ఉమ్మడి కృష్ణాజిల్లాలో మైనింగ్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి, కలిదిండి, ముదినేపల్లిలో పెద్ద ఎత్తున ఇసుక ఉండటంతో ఈ ప్రాంతం నుండి లారీలతో బుసక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Off The Record: ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలు కొందరు ఉడికిపోతున్నారా? డైరెక్ట్గా బయటపడేందుకు ధైర్యం చాలడం లేదా? అలాగని కామ్గా ఉండలేకపోతున్నారా? ఏదో ఒకరూపంలో తమ అసంతృప్తిని బయటపెట్టాలని తెగ ప్రయత్నిస్తున్న ఆ నాయకులు ఎవరు? ఎందుకు అంతలా మధనపడుతున్నారు?.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది.. ఇప్పటికే పలు కేసులు ఆయనపై నమోదు కాగా, తాజాగా మరో మూడు కేసులు పెట్టారు పోలీసులు.. వల్లభనేని వంశీ పై మూడు కేసలు నమోదు చేశారు కృష్ణా జిల్లా పోలీసులు.. ఆత్మకూరు, వీరవల్లి పోలీస్ స్టేషన్లతో పాటు మళ్లీ గన్నవరం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి..
వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు.. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్ - 30 అమలులో ఉన్నట్టు పేర్కొన్నారు.. ఈ సెక్షన్ అమలు నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.. అయతే, పోలీసుల నిషేదాజ్ఞలను అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు.