YS Jagan: కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి.. జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష..
- కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి..
- ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల సమావేశంలో వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష.. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు జగన్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. రాష్ట్రంలో రెడ్ బుడ్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు.. వ్యవస్ధలన్నీ కూప్పకూలిపోయిన పరిస్దితి కనిపిస్తోంది. దొంగకేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగులు పెట్టినా, ఫార్వార్డ్ చేసినా కూడా కేసులు పెడుతున్నారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. మన ప్రభుత్వానికి, చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ప్రజలు పోల్చి చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రతి ఇంట్లోనూ చర్చ నడుస్తుంది. జగన్ కుటుంబమంతటికీ మేలు చేశాడు. చంద్రబాబు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు చేస్తానన్న ప్రలోభాలకు మొగ్గు చూపిన పరిస్థితులు చూశాం అన్నారు..
Read Also: Income Tax Department: ఇక్కడ దోచుకుంటున్నారు.. అక్కడ దాచుకుంటున్నారు.. దుబాయ్‌లో భారతీయుల ఆస్తులు
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇక, చంద్రబాబు సాధ్యం కాని హామీలిచ్చారని విమర్శించారు వైఎస్ జగన్. మనకు అబద్దాలు చెప్పడం చేతగాదు. మన పాలనలో చక్కగా బటన్లు నొక్కాం. కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనని ప్రజలు ఆశపడ్డారు.. కానీ ఆరునెలలు తిరక్కమునుపే వాస్తవం అర్ధమయిందన్నారు.. ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరుగుతోంది. ప్రతి వ్యవస్ధ కుప్పకూలిపోతుంది. ఫీజులు ఇవ్వక పిల్లలు కాలేజీలకు వెళ్లలేని దుస్థితి. జనవరి నాటికి ఏడాది ఫీజులు పిల్లలకు ఇవ్వని పరిస్థితి ఉంది.. ఆరోగ్యశ్రీకి బకాయిలు రూ.2,200 కోట్లు పెండింగ్ పెట్టారు.. 108, 104 డయల్ చేసినా ఆంబులెన్స్ వస్తుందన్న పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోలు పరిస్థితి దయనీయంగా ఉంది. రైతులు ఎంఎస్పీ కంటే రూ.300 తక్కువకు అమ్ముకుంటున్నారంటూ ప్రభుత్వ తీరుపై జగన్ తీవ్ర ఆక్షేపణ చేశారు..
Read Also: Tamil Nadu: ‘‘ఖాకీ’’ సినిమా లాగే.. ఫామ్ హౌజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య..
నేను మీ అందరికీ కోరేది ఒక్కటే.. మనలో పోరాట పటిమ సన్నగిల్లగూడదని ధైర్యాన్ని చెప్పారు వైఎస్ జగన్.. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష సమయం అన్నారు.. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు.. బెయిల్ కూడా ఇవ్వలేదు అంటూ తన నిజజీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను గుర్తుచేసుకున్నారు.. అయితే, అయినా తాను ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యాను అన్నారు వైఎస్ జగన్.. గతంలో వైసీపీకి 151 స్థానాలు వచ్చాయి.. కానీ, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ కి పరిమితం చేయాలని సూచించారు.. అబద్ధం, మోసాలు చేస్తూ మంచి చేయని వారిపై ప్రజలకు కోపం వస్తుంది.. మనపై ప్రేమ పెరుగుతుంది.. మోసమే పరమావధిగా ఉన్న వారిని ప్రజలు ఏం చేస్తారో మనం చూస్తాం అని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
తాజావార్తలు
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!