AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు.. వర్షాకాల సమావేశాలలోపే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు వేగవంతమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోపే ప్రభుత్వానికి నివేదికని ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకొనుంది. అయితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రెండు మూడు జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని చోట్ల హద్దులు మార్చే అవకాశం ఉందని సమాచారం. వైస్సార్సీపీ హాయాంలో పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అయితే, ఇందులోని గందరగోళం ఉందని మార్పులు అవసరమని భావించింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం.
ఇందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు మండలాలు గ్రామాల సరిహద్దులు పేర్ల మార్పు సర్దుబాట్లపై అధ్యయనానికి ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ ఇప్పటికే ప్రజలు ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించింది. అంతేకాకుండా వినతలను కూడా స్వీకరించింది. వీటన్నిటిపై త్వరలో ఉపసంఘం చర్చించి అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనుంది.
Also Read
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
- Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Nepal: లగ్జరీ కార్లు.. విలాసవంతమైన భోగాలు.. వెలుగులోకి ప్రముఖుల పిల్లల చిత్రాలు
కేంద్రం జనగణన చేయనున్నడంతో 2026 నుంచి 27 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు పేర్లు మార్చేందుకు వీలుండదు. కాబట్టి, 2025 డిసెంబర్ 31 లోపు జిల్లాల పునర్విభజన హద్దుల్లో మార్పులు చేర్పులు పూర్తి చేసి అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగుణపాలం, దర్శి కలిపి ఐదు నియోజక వర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలించే ఛాన్స్ ఉంది.
అలాగే బాపట్ల జిల్లాలోని అద్దంకి నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజక వర్గాలని మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలిపితే అక్కడి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇక అమరావతి కేంద్రంగా కొత్తగా అర్బన్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాలు గుంటూరు జిల్లా మంగళగిరి, తాడికొండ నియోజక వర్గాల్లోకి వస్తాయి. వీటితో పాటు పెదకూరుపాడు, నందిగామ, జగ్గయపేట నియోజక వర్గాలు భౌగోళికంగా అమరావతికి దగ్గరగా ఉంటాయి. వీటితో కొత్త అర్బన్ జిల్లా ఏర్పాటు చేస్తే ఐదు నియోజక వర్గాలు అయ్యే అవకాశం ఉంటుంది.
Hyderabad Rains : కొట్టుకుపోయిన పునాది.. కూలడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు.!
ఇక గుంటూరు జిల్లాలోనూ గుంటూరు తూర్పు, పశ్చిమ, పత్తిపాడు, పొన్నూరు, తెనాలి కలిపి ఐదు నియోజక వర్గాలు అవుతాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం పెనమలూరు నియోజక వర్గాలని ఎన్టీఆర్ జిల్లాలో కలపొచ్చు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య, తిరువూరు, మైలవరం, గన్నవరం, పెనమలూరు సహా ఏడు నియోజక వర్గాలు అవుతాయి. కృష్ణా జిల్లాలో ఐదు నియోజక వర్గాలు ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!