కృష్ణా జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అదుపులోనికి తీసుకున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో విచ్చలవిడిగా క్రికెట్ ఆన్లైన్ బెట్టింగులు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నియోజకవర్గ పరిధిలో ఉంగుటూరు మండలంలో 10మందిని, గన్నవరం మండలంలో 10మందిని, బాపులపాడు మండలంలో మరికొందరు క్రికెట్ భూకీలను అదుపులోకి తీసుకున్నారు. నియోజకవర్గ పరిధిలో యువత వ్యసనాలకు బానిసలై బెట్టింగులకు పాల్పడుతున్నారు.
READ MORE: Nara Lokesh: టీటీడీ గోశాలలో గోవుల మరణాల ప్రచారంపై మంత్రి నారా లోకేష్ రియాక్షన్..
కొంత మంది యువత గతంలో ఆన్లైన్ బెట్టింగుల్లో మోసపోయి ప్రాణాలు తీసుకున్నారు. యువత బెట్టింగులకు పాల్పడి ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులను అంధకారంలోకి వదిలేస్తున్న వైనం నెలకొంది.. ఇంతా జరుగుతున్న నియోజకవర్గంలో పోలీసులు చోద్యం చూస్తూ మిన్నకున్నారు. నియోజకవర్గంలో సుమారు 40 మందికి పైగా క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు.. పట్టుబడ్డ వారి నుంచి 50 కి పైగా మొబైల్ ఫోన్లు, కొంత నగదును స్వాధీనం చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.
READ MORE: Allahabad HC: మరో వివాదంలో అలహాబాద్ హైకోర్టు.. “అత్యాచార” తీర్పుపై సర్వత్రా విమర్శలు