రౌడీ షీటర్లకు చుక్కలు చూపించేందుకు సిద్ధం అవుతున్నారు ఏపీ పోలీసులు… కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్.. రౌడీ షీటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రౌడీ షీటర్లకు ప్రభుత్వ పథకాలు అందకుండా చర్యలు తీసుకుంటామంటూ.. కృష్ణా జిల్లాలో రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.. జిల్లా వ్యాప్తంగా రెండు కంటే ఎక్కువ కేసుల్లో ఉన్నవారిని కౌన్సిలింగుకు పిలిపించాం.. రాబోయే రోజుల్లో చేసే స్పెషల్ యాక్షన్ ప్లాన్ వివరించాం.. పాత నేరస్ధులపై నిఘా పెంచుతామని వెల్లడించారు.. ఇక, రౌడీషీట్లు,…
ఈ నెల 19 వ తేదీన వ్యాపారి రాహుల్ తన కారులోనే శవమై కనిపించాడు. అయితే, అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్యచేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి రాహుల్‌ను హత్యచేశారనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే, రాహుల్‌ను హత్య కేసులో ప్రధాన నిందితుడైన కోరాడ విజయ్ కుమార్…
పదవుల పంపకాల్లో అనేక వడపోతలు.. లెక్కలు వేస్తాయి పార్టీలు. అధికారంలో ఉన్న పార్టీ అయితే మరెన్నో సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇటీవల ఏపీలో అదే జరిగిందని వైసీపీ వర్గాల్లో ఒక్కటే చర్చ. కాకపోతే ఆ జిల్లాలో మాత్రం విభజించు.. పాలించు సూత్రం పాటించారని చెవులు కొరుక్కుంటున్నారట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. పదవుల పంపకంలో సామాజిక లెక్కలు! ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల పంపకాల్లో కృష్ణాజిల్లాకు కీలకమైన పోస్ట్‌లే దక్కాయి.కమ్మ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఏపి పరిశ్రమల అభివృద్ధి…
ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది ఒక్కసారే. తర్వాత పోటీ చేసి ఓడిపోయింది మాత్రం మూడుసార్లు. టీడీపీ ఆయన్నే నమ్ముకుందో ఏమో.. ఓడినా ఇంఛార్జ్‌గా కొనసాగిస్తోంది. విచిత్రం ఏంటంటే.. సొంత పార్టీ కేడర్ ఆయన్ని ఓన్ చేసుకోదు. కేడర్ వర్సస్ లీడర్ అన్నట్టుగా అక్కడ పార్టీ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉంటాయి. ఇంతకీ ఎవరా నాయకుడు? రోడ్డున పడుతున్న నూజివీడు టీడీపీ రాజకీయాలు కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ వింత పరిస్థితి ఎదుర్కొంటోంది. అక్కడ పార్టీ ఇంఛార్జ్‌కు, కేడర్‌కు మధ్య…
మహమ్మారి వల్ల ప్రస్తుతం హీరోలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే, పవన్ కళ్యాణ్ మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఆయనకు కరోనా సోకటంతో ఇప్పుడు స్లోగా రికవర్ అవుతున్నారు. డాక్టర్స్ ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది అనటంతో పీకే పూర్తిగా తన ఫామ్ హౌజ్ కే పరిమితం అయ్యారు. కాకపోతే, మళ్లీ షూటింగ్స్ మొదలైతే ఆయన నటిస్తోన్న రెండు చిత్రాలు కూడా సెట్స్ మీదకి వెళతాయి. అంతలోగా పవన్ ఫిజికల్ గా ఫిట్ గా మారాల్సి…
కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసారన్న మనస్తాపంతో భర్త గుండెపోటుతో మరణించాడు. మృతుడు దాసరి రమేష్(36) బాపులపాడు మండలం ఏ. సీతారామపురానికి చెందినవాడు. కాగా రెండ్రోజుల క్రితం రమేష్ భార్య హనుమాన్ జంక్షన్ సీఐ రమణకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. నిందితుడిపై కేసు నమోదు చేశామన్న వీరవల్లి పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకోకపోవడం వల్లనే రమేష్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఆందోళన చేశారు. రోడ్డుపై నిరసనను పోలీసులు…
ఇప్పటికే కరోనా కలవర పెడుతుంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు ఏపీలో వెలుగు చూడడం కలకలంగా మారుతోంది.. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వెలుగుచూడగా.. తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలోనూ ఈ తరహా కేసులు బయటపడ్డాయి.. తాజాగా.. ఏపీ కృష్ణ జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు గుర్తించారు. అయితే ఉయ్యురుకి చెందిన పంచాయితీ కార్యదర్శి బ్లాక్ ఫంగస్ తో మరణించాడు. దాంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇంతియాజ విచారణకి ఆదేశించారు.
కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతోమంది ప్రముఖుల ప్రాణాలు తీసింది.. పోలీసుల విభాగంలోనూ పెద్ద ఎత్తున కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు ప్రాణాలు కోల్పోయారు.. తాజాగా.. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ రామ్ ప్రసాద్ కరోనా మృతి చెందారు. పోలీస్ శాఖలో సౌమ్యుడిగా, సమర్ధవంతమైన అధికారిగా పేరుపొందిన ఆయన.. కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. గత 10 రోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఇవాళ ఆయన పరిస్థితి మరింత విషమించి కన్నుమూశారు.. కృష్ణ జిల్లా…