ఇప్పటికే కరోనా కలవర పెడుతుంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు ఏపీలో వెలుగు చూడడం కలకలంగా మారుతోంది.. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వెలుగుచూడగా.. తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలోనూ ఈ తరహా కేసులు బయటపడ్డాయి.. తాజాగా.. ఏపీ కృష్ణ జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు గుర్తించారు. అయితే ఉయ్యురుకి చెందిన పంచాయితీ కార్యదర్శి బ్లాక్ ఫంగస్ తో మరణించాడు. దాంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇంతియాజ విచారణకి ఆదేశించారు.