కృష్ణా జిల్లా ఎస్పీ సంచలన వ్యాఖ్యలు.. ఇక రౌడీ షీటర్లకు చుక్కలే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ షీటర్లకు చుక్కలు చూపించేందుకు సిద్ధం అవుతున్నారు ఏపీ పోలీసులు… కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్.. రౌడీ షీటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రౌడీ షీటర్లకు ప్రభుత్వ పథకాలు అందకుండా చర్యలు తీసుకుంటామంటూ.. కృష్ణా జిల్లాలో రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.. జిల్లా వ్యాప్తంగా రెండు కంటే ఎక్కువ కేసుల్లో ఉన్నవారిని కౌన్సిలింగుకు పిలిపించాం.. రాబోయే రోజుల్లో చేసే స్పెషల్ యాక్షన్ ప్లాన్ వివరించాం.. పాత నేరస్ధులపై నిఘా పెంచుతామని వెల్లడించారు.. ఇక, రౌడీషీట్లు, సస్పెక్ట్ షీట్లు కూడా తెరుస్తామని ప్రకటించిన ఆయన.. ప్రభుత్వ పథకాలు వారికి రాకుండా వారి లిస్టు ప్రభుత్వానికి అందజేస్తామని స్పష్టం చేశారు.. మొదటిసారి ఇలా పెద్ద మొత్తంలో రౌడీ షీటర్లను పిలిచాం.. ఇప్పుడే కొందరిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నామని తెలిపారు సిద్ధార్థ్ కౌశల్.
ఇక, గంజాయి జిల్లా వ్యాప్తంగా సీజ్ చేస్తున్నామన్నారు ఎస్పీ.. ఈ స్పెషల్ యాక్షన్ ప్లాన్ వెంటనే అమల్లోకి వస్తుందన్న ఆయన.. ఎవరైతే నిజంగా మారారని గుర్తిస్తామో.. వారికి అన్ని సహాయ సహకారాలు ఉంటాయన్నారు. మరోవైపు.. ఉత్తరాంధ్రలో గంజాయి హబ్ ఉంటుందని తెలిసింది.. విశాఖ ప్రాంతంలో గంజాయి పెంచే ప్రదేశాలు గుర్తించి నాశనం చేస్తారని వెల్లడించిన ఆయన.. కృష్ణాజిల్లాలో కూడా అదే విధంగా చేయనున్నట్టు వివరించారు.. నిన్న, మొన్న రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 14 గంజాయి కేసులు పెట్టాం.. దూరంగా విసిరేసినట్టు ఉన్న గ్రామాలకు జియో ట్యాగింగ్ చేస్తున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషనుతో మాట్లాడాం.. జాబ్ మేళా ద్వారా మారిన వారి కుటుంబీకులకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు వెల్లడించారు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్.
Also Read
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
తాజావార్తలు
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?