కృష్ణా జిల్లాలో కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 29 వార్డులకు 14 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు, 14 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒకస్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు సొంతం చేసుకున్నాడు. దీంతో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు కోసం అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి.
Read Also: దర్శిలో టీడీపీ విజయ కేతనం